మిగిలిన పళ్లతో పోలిస్తే వెలగ పండు కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది, పైగా దీనిని తినేవారి సంఖ్యా కూడా తక్కువే, కేవలం వినాయకచవితి పండల్లో మాత్రమే వెలగపండును ఉపయోగిస్తారు. అయితే నిపుణుల ప్రకారం వెలగపండులో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి. దీనిని తినడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు నుండి బయట పడవచ్చు, ఎన్నో రుగ్మతులను నయంచేసే గుణం వెలగపండుకు ఉంది. వెలగ పండులో ఉండే ఔషధ గుణాల గురించి మరియు దానిని తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెలగపండును వుడ్ ఆపిల్ మరియు ఎలిఫెంట్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. దీనిని రుచి కూడా ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది, కాస్త పులుపు మరియు వగరుగా ఉండే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పండును ప్రతిఒక్కరు తినాలని వైద్యులు మరియు ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులో సిట్రిక్ ఆమ్లాలు, రైబోఫ్లవిన్, పిండిపదార్దాలు, ఫైబర్స్, ఆక్సలిక్ ఆమ్లాలు, ప్రోటీన్లు, నియాసిన్, కాల్షియమ్, ఐరన్ వంటి పోషకాలెన్నో పుష్కలంగా ఉన్నాయి.
సాధారణంగా విటమిన్-సి సమృద్ధిక ఉన్న ఫలాలు పుల్లగా ఉంటాయి, పూలుపూరుచితో ఉండే వెలగపండులో కూడా విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. వెలగపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, రోగాల భారిన పడకుండా నిరంతరం కాపాడుతుంది. వయసు పైబడే కొద్దీ కీళ్లనొప్పులు సహజం, ఈ నొప్పులు ఎక్కువుగా ఉన్నవారు వెలగపండు తినడం ద్వారా ఈ నొప్పులు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వెలగపండులో ఫైబర్ ఎక్కువుగా ఉండటం మూలాన మలబద్దకం భారిన పడకుండా ఉండచ్చు, అంతేకాకుండా మలబద్దకం ఉన్నవారికి ఈ సమస్య నయమవుతుంది.
వెలగపండుతో తయారుచేసిన కషాయాన్ని సేవిస్తే జలుబు తగ్గుతుందని భావిస్తారు, అలాగే దగ్గు ఎక్కువగా రావడానికి కారణమైన కఫం తగ్గతుంది అలాగే ఉబ్బసం కూడా పెరగకుండా ఉంటుంది. కళ్ళకు సంభందించిన ఇన్ఫెక్షన్లు మరియు కళ్ళ మంటలు తగ్గించడంలో వెలగపండు ఎంతగానో సహాయపడుతుంది. క్యాన్సర్ నివారణకు కూడా వెలగ పండు సహాయపడుతుంది.
మహిళలు ఈ వెలగపండు గుజ్జు క్రమం తప్పకుండ తినడం ద్వారా రొమ్ము మరియు గర్భాశయానికి వచ్చే క్యాన్సర్ ను రాకుండా నివారించవచ్చు. దీనితోపాటు కాలేయ ఆరోగ్యానికి మరియు హృదయసంబంధిత వ్యాధులకు వెలగపండు ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఒక 100 గ్రాముల వెలగ పండులో, 140 క్యాలోరీలు, 32 గ్రాముల పిండి పదార్ధాలు, 2 గ్రాముల ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి, దీనిని తరచూ తినడం ద్వారా అలసట తగ్గి, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
Share your comments