ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారమే ప్రధానం అన్నారు మన పెద్దలు. మంచి ఆహరం తీసుకుంటూనే మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారంతో పాటు, వ్యాయామం కూడా అవసరం. ఎటువంటి శారీరిక వ్యాయామం చెయ్యని వారిలో అనారోగ్య సమస్యలు తలైతే అవకాశం ఉంటుంది. వ్యాయామానికి తగిన విధంగా ఆహారం తినడం ఎంతో కీలకం. ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రధానమైనవి మొలకలు.
ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో మొలకలు తినేవారి సంఖ్య పెరుగుతూవస్తుంది. మొలకలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, స్నాక్స్ లాగా, లేదా ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజాలు లభిస్తాయి. మొలకల్లో మన శరీరానికి కావల్సిన పోషకవిలువలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో శక్తిని అందించే కార్బోహైడ్రేట్స్ తోపాటు విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా మొలకల ద్వారా లభిస్తాయి.
రక్థ హీనతతో బాధపడేవారు, మరియు ఐరన్ లోపలం ఉన్నవారు రోజు మొలకలు తిందాం ఎంతో మంచిది. మొలకల తినడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు ఘననీయంగా పెరుగుతాయి. మొలకల్లో కాల్షియమ్ పుష్కలంగా దొరుకుతుంది కనుక ఎముక పుష్టి జరిగి ఎముకలు గట్టిపడటానికి తోడ్పడుతుంది. మొలకల ద్వారా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు బయటకు పంపడంలో వ్యర్ధాలు కీలక పాత్ర పోషిస్తాయి. మొలకెత్తిన విత్తనాలను పచ్చివి లేదా ఉడకబెట్టి తినవచ్చు, పచ్చివి తింటే శరీరానికి మరింత లాభం చేకూరుతుంది.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును నియంత్రించడంలో మొలకలు ఉపయోగపడుతాయి, బరువు తగ్గించడంలో మొలకలు సహాయం చేస్తాయి. మొలకలు తినడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, మెదడు పనితీరు పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో రుజువయ్యింది. కంటిచూపు మందగించినవారికి కంటి చూపు మెరుగుపరచడంలో మొలకలు సహాయం చేస్తాయి. ఉదయాన్నే మొలకలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తీ లభించి, రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. అంతేకాకుండా ఒత్తిడి అధికంగా ఉన్నవారికి ఒత్తిడి తగ్గడానికి మొలకలు తోడ్పడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మొలకలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
- Read More:
-
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు ఇవే....
Share your comments