Health & Lifestyle

Benefits of Mango: వేసవిలో మామిడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Srikanth B
Srikanth B
వేసవిలో మామిడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో?
వేసవిలో మామిడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో?

Mango Benefits: వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్! మామిడి పండ్లు రుచిలో అద్భుతంగా ఉండడం సహా అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే వేసవిలో మామిడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం .

  1. మెరుగైన జీర్ణక్రియ కోసం

మీకు జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే మామిడి పండు మీకు చక్కని పరిష్కారం . మామిడి పండులో డైజెస్టివ్ ఎంజైములు ఉంటాయి. ఇందులో నీటి శాతం, ఫైబర్.. శరీరంలోని అతిసారం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతాయి. 

  1. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు

మామిడి పండ్లలో సరిపడా విటమిన్ - ఏ ఉంటుంది. ఇందులో విటమిన్ - సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు  మామిడి పండులో కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ బి వంటి విటమిన్లు, ఖనిజాలు అదనంగా లభిస్తాయి. వాటి వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 

  1. మెరిసే చర్మం కోసం..

మామిడి పండులో విటమిన్ సి, విటమిన్ ఎ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ సరైన మోతాదులో మామిడి పండ్లను తింటే కొద్ది రోజుల్లోనే మీ చర్మపు మచ్చలు మాయమవుతాయి.

  1. గుండెకు ఆరోగ్యం కోసం

పండ్ల రారాజు మామిడి మనల్ని గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. ఫైబర్, పొటాషియం వాటి వల్ల గుండె నుంచి ప్రవహించే ధమనులలో ఎలాంటి అడ్డంకి లేకుండా కాపాడుతాయి. పాలీఫెనాల్ బయోయాక్టివ్‌గా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

  1. బరువు తగ్గేందుకు

మామిడి పండ్లను తినడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. మామిడి తొక్కలో ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది సహజ కొవ్వును కరిగేలా చేస్తుంది. అంటే శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ మామిడిలో ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మీరు అధిక ఫైబర్ పండ్లు లేదా కూరగాయలు తిన్నప్పుడు, మీరు ఎక్కువసేపు ఆకలితో ఉండరు. దీని వల్ల అతిగా ఆహారాన్ని తినకుండా ఉండేందుకు మామిడి పండ్లు సహకరిస్తాయి.

ఇది కూడా చదవండి.

వేకువజామున నీరు తాగటం వలన కలిగే ప్రయోజనాలు,ప్లాస్టిక్ బాటిల్లో నీరు త్రాగితే ఏమవుతుంది?

Share your comments

Subscribe Magazine