Health & Lifestyle

30 ఏళ్ళు దాటినా మొగవారు బెండకాయ నీరు తాగాలి.... ఎందుకంటే?

KJ Staff
KJ Staff

మనం తరచు వినియోగించే కూరగాయల్లో బెండకాయ ఒకటి. బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి చెప్పేవారు, ఎందుకంటే ఈ విధంగానైనా పిల్లతో బెండకాయ తినిపించి దీనిలోని పోషకాలు వారికి అందేలా చెయ్యాలని. బెండకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. బెండకాయను కూర లేదంటే ఫ్రై గా మాత్రమే తినకుండా బెండకాయ నీటిని తాగడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరీముఖ్యంగా 30 ఏళ్ళు దాటినా మొగవారు ఈ నీరు తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వయసు పైబడే కొద్దీ పురుషుల శరీరంలో కొన్ని మార్పులు సంభవించడం సహజం. ఇటువంటి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం చాలా ముఖ్యం. మనం తినే ఆహారం నుండి ఈ పోషకాలు లభిస్తాయి. బెండకాయలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిలో మాంగనీస్, విటమిన్-సి, ఫైబర్, ఫోలేట్, మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు 30 ఏళ్ళు దాటినా పురుషులకు చాలా అవసరం. అయితే బెండకాయను కూరగా మాత్రమే కాకుండా బెండకాయ నీటిని తాగితే ఈ పోషకాలు అన్ని లభించే అవకాశం ఉంటుంది.

బెండకాయ నీటిని తయారుచెయ్యడం కూడా చాలా సులభం. ఇందుకోసం ముందుగా బెండకాయను ముక్కలుగా కోసి 24 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు వీటిలో ముక్కలను తీసేసి ఈ నీటిని తాగవలసి ఉంటుంది. ఈ నీటిని ఉదయాన్నే తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీర్ఘకాలిక మధుమేహంతో బాధపడేవారికి ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నీటిలోని కొన్ని ప్రత్యేక లక్షణాల మూలంగా రక్తంలోని చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.


బెండకాయలోని ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పొట్ట ఆరోగ్యాన్ని సంరక్షించి జీర్ణక్రియను పెంపొందిస్తాయి. కండరాల శోషణ శక్తిని పెంపొందించి రక్తంలో చెక్కెర స్థాయి నియంత్రణలో ఉండే విధంగా చేస్తుంది. ఈ బెండకాయ నీరు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయలా సంవృద్ధిగా ఉండే విటమిన్- ఏ, సి ఒత్తిడిని ఆక్సీకరణను తగ్గించి, చర్మం పొడిబారకుండా ఉండేలా చేస్తుంది. చర్మం మీద ముడతలు రాకుండా కూడా నివారిస్తుంది.

Share your comments

Subscribe Magazine