సహజంగా కొంతమంది పెరుగును వేసవి కాలంలో మాత్రమే తమ ఆహారంలో ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. పెరుగు శరీర ఉష్ణోగ్రతను మాత్రమే తగ్గిస్తుంది అన్న భావన చాలా మందిలో కలిగి ఉంది అది పొరపాటే. పెరుగును ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మైక్రోన్యూట్రీషియన్స్ తో పాటు మన శరీరానికి మేలు చేసే లాక్టోబసిల్లస్ అడిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే మేలు చేసే బ్యాక్టీరియా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తినడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతోపాటు అజీర్తి , జలుబు, కీళ్ల నొప్పులు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. అయితే పెరుగును కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యతిరేక చర్య జరిగి కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చాలామంది పెరుగులో చక్కెర కలుపుకుని తింటుంటారు.ఇలా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగడమే కాకుండా షుగర్ వ్యాధికి కారణం అవుతుందని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.మామిడి పండుతో పెరుగును కలిపి తినడం వల్ల శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
అరటిపండును, పెరుగుతో కలిపి తినకూడదు. ఈ రెండు కలిపి తినడం వల్ల కొంతమందిలో తీవ్ర కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.పెరుగు, చేపలు ఈ రెండింటిలో ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల అజీర్తి సమస్య ఏర్పడుతుంది. పెరుగును పాలతో కలిపి తినడం వల్ల ప్రమాదకర డయేరియా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి పెరుగును ఇలాంటి పదార్థాలతో సాధ్యమైనంతవరకు తినకపోవడమే మంచిది.
Share your comments