Health & Lifestyle

రిఫైన్డ్ నూనె కంటే కోల్డ్ ప్రెస్డ్ నూనె మంచిదా? తెలుసుకుందాం రండి....

KJ Staff
KJ Staff

మనకి మార్కెట్లో రిఫైన్డ్ ఆయిల్ విరివిగా లభిస్తుంది, మిల్లుల వద్ద ఆడించిన నూనెకంటె ఇది తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి, దీనికి గిరాకీ ఎక్కువుగా ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగిస్తే శరీరంలో చెడు కొవ్వు పెరిగే అవకాశం ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు, రిఫైన్డ్ ఆయిల్ కి బదులుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడమని వినియోగదారులకు సూచిస్తున్నారు. అయితే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వంటలకు ఉపయోగించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిఫైన్డ్ ఆయిల్ తయారై మిమ్మల్ని చేరుకునే ముందు ఎంతో ప్రాసెస్ అవుతుంది, రిఫైన్డ్ నూనెను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద సేకరించి, ఎక్కువ కాలం నిల్వచేసేందుకు దానిని సాల్వెంట్ ఎక్సట్రాక్షన్, బ్లీచింగ్, మరియు డిఆర్డర్రైజేషన్ వంటి అనేక ప్రక్రియల ద్వారా శుద్ధిచేస్తారు. వీటివలన ఈ నూనె దానిలోని సహజసిద్దమైన గుణాలను కోల్పోతుంది. అదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో ఎటువంటి ప్రాసెసింగ్ ఉండదు. నూనె గింజల నుండి నూనెను 49℃ వద్ద తియ్యడం ద్వారా, నూనెలోని అనేక పోషకాలు మరియు ఇతర గుణాలు పోకుండా ఉంటాయి.

కోల్డ్ ప్రెస్డ్ నూనెలో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది, ఇది యాంటియోక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంతేకాదు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడగలదు. మొక్కలు నుండి లభించి పోలీఫినోల్స్ కోల్డ్ ప్రెస్డ్ నూనెలో ఎక్కువుగా ఉంటాయి, ఇవి యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీఇన్ఫ్లమ్మెటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ తో పోలిస్తే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వంటచెయ్యడానికి తక్కువ సరిపోతుంది, అంటే తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చెయ్యొచ్చన్నమాట. అయితే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తక్కువ రోజులు నిలవసామర్ధ్యం కలిగి ఉంటుంది కాబట్టి, తక్కువ మొత్తంలో ఖరీదు చెయ్యడం మంచిది.

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, ఇవి గుండే ఆరోగ్యం కాపాడటంతోపాటు, బీపీ ని కూడా కంట్రోల్ చేస్తాయి. కోల్డ్ ప్రెస్డ్ నూనెలో ఎస్సెన్సియల్ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 ముఖ్యమైనవి, ఇవి గుండె మరియు మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున, ఆవాలనూనె, నువ్వల నూనె, మరియు వేరుశెనగ నూనె, వీటిలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కొని వంటచెయ్యడానికి వినియోగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

 

Share your comments

Subscribe Magazine