Health & Lifestyle

నెయ్యితో చెడు కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు

KJ Staff
KJ Staff

మన పూర్వికులు మనకు వారసత్వంగా అందించిన ఆహారంలో ఎన్నో ఔషధ గుణాలు పొందుపరచబడి ఉన్నాయి. కానీ పాశ్చాత్య దేశాల సంస్కృతిని అలవర్చుకుని మనం కూడా వారి ఆహారానికి అలవాటు పడుతున్నాం. మన పూర్వికులు ఆహారని నెయ్యితో వండేవారు. నెయ్యిలో అనేక రకాల పోషకవిలువలు, చెడు కొవ్వును కరిగించగల శక్తీ ఉన్నాయి. నేడు మనం వాడుతున్న సన్ ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ఎంతో ప్రమాదకరమని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

పండగ వేళల్లో దేవునికి నివేదించే ప్రసాదం నెయ్యితో చేసింది నివేదించమని చెబుతారు, దీని ద్వారా నెయ్యిని కొన్ని వందల సంవత్సరాల నుండి మన భాగంగా ఉందని తెల్సుతుంది. కాని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల నెయ్యిలో కొవ్వు పదార్ధాలు ఎక్కువ ఉంటాయని కనుక దీనికి దూరంగా ఉండాలంటూ ప్రచారం జరుగుతుంది. నిజానికి నెయ్యిలో శరీరానికి, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్ధాలు ఉంటాయి. నెయ్యిని ఆహారంలో తినడం ద్వారా విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి లభిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును బయటకు పంపించడంలో నెయ్యి తోడ్పడుతుంది.

నెయ్యిలోని కొవ్వు పదార్ధాలు మెదడుకు పనితీరు పెంచడంలో సహాయంచేస్తాయి. నెయ్యిని ప్రపంచంలోనే ఉత్తమ ఫ్యాట్ గా పరిగణిస్తారు. నెయ్యి అధిక రక్తపోటును నియంత్రించి, గుండె రోగాలు దగ్గరకు రాకుండా కాపాడగలదు. నెయ్యిలో కొవ్వును కరిగించే కంజుగేటేడ్ లైనోలిక్ అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది చెడు కొవ్వును నియంత్రించి, కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

నెయ్యిలో ఎన్నో మంచి చేసే గుణాలున్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న నెయ్యి చాల వరకు కల్తీదే. ఇటువంటి నెయ్యిలో, డాల్డా, పామ్ ఆయిల్ వంటి వాటిని కలిపి విక్రయిస్తారు, కనుక వినియోగదారులు జాగ్రత్త వహించాలి. గ్రామాల్లో దొరికే దేశి ఆవు, గేదె నెయ్యిని మాత్రమే వినియోగించాలి. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నెయ్యిని మితంగా తింటేనే దానిలో పోషకవిలువలు లభిస్తాయి అని గుర్తుపెట్టుకోండి.

Share your comments

Subscribe Magazine