సాధారణంగా మార్కెట్లో అన్ని రకాల నూనెలతో పాటు జాస్మిన్ ఆయిల్ మనకు అందుబాటులో ఉంది. జాస్మిన్ ఆయిల్ మల్లెపువ్వుల నుంచి తయారు చేస్తారు. ఈ జాస్మిన్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ముఖ్యంగా అధిక పని ఒత్తిడి కారణంగా మనలో కలిగే మానసిక ఆందోళనలు, ఒత్తిడిని దూరం చేయడానికి జాస్మిన్ ఆయిల్ దోహదపడుతుంది. జాస్మిన్ ఆయిల్ వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం...
పలు అధ్యయనాల ఆధారంగా చాలా మంది మానసిక ఆందోళనతో, అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ఫలితంగా నిద్రలేమి సమస్యతో బాధ పడటం జరుగుతుంది. అలాంటి వారు జాస్మిన్ ఆయిల్ ఉపయోగించడం వల్ల మన మెదడును ఉత్తేజపరిచి మనలో ఉన్నటువంటి ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. జాస్మిన్ ఆయిల్ నుంచి వెలువడే సువాసన మనలోని రక్తప్రవాహానికి దోహదపడుతుంది. జాస్మిన్ ఆయిల్ ఉపయోగించడం వల్ల మనలో శ్వాస రేటు, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతాయి.
జాస్మిన్ నూనెలో అధిక భాగం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మన శరీరం పై దాడి చేసే బ్యాక్టీరియల్ ఫంగల్ వ్యాధులను అరికట్టడానికి జాస్మిన్ ఆయిల్ దోహదపడుతుంది. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.ఆందోళన, నిరాశ, కండరాల నొప్పి మరియు తక్కువ శక్తితో సహా ప్రసవానంతర లక్షణాలను తగ్గించడంలో జాస్మిన్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనెను మనం వాసన చూడటం ద్వారా లేదా శరీరంపై మర్దన చేయడం ద్వారా నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు.
Share your comments