సొయా చంక్స్ అంటే మీల్ మేకర్ అని పిలిచే వీటితో ఎన్నో రుచికరమైన వంటకాలు చేసి తింటాము.దీనిలో అధికంగా ఉండే ప్రోటీన్ కారణంగా చాల మంది దీనిని మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. అయితే వీటిలో పోషకాలు ఉన్నపటికీ కొన్ని చెడు ప్రభావాలు కూడా ఉన్నాయి.
మీల్ మేకర్ ను సోయా బీన్స్ నుంచి తయారు చేస్తారు. సొయా బీన్ లలో చాల అధిక మొత్తం లో ప్రోటీన్, ఇతర పోషకాలు ఉన్నపటికీ ,వాటిలో ఐసోఫ్లేవోన్స్ అని పిలువబడే ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి ఈ సమ్మేళనాలు కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, అని అలాగే స్త్రీ సంతానోత్పత్తిని మరియు థైరాయిడ్ పనితీరులో చేదు ప్రభావము చూపిస్తాయి అని కొన్ని పరిశోధనల్లో వెల్లడైయింది. కాబట్టి వాటి నుండి తయారైన మెయిల్ మేకర్ వల్ల కూడా ఆరోగ్యానికి ప్రమాదం ఉంది.
మీల్ మేకర్ పిల్లలు ఎక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం, శరీర అలర్జీలు వస్తాయి. మీల్ మేకర్‌ను ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ కణాల ఉత్పత్తికి దారితీస్తుంది.
మీల్ మేకర్ దీర్ఘకాలిక మంట, ఖనిజ లోపాలను కలిగిస్తుంది.అతిగా తీసుకోవడం వల్ల ఇందులోని ప్రోటీన్ జీర్ణక్రియను నిరోధిస్తుంది. మీల్ మేకర్‌లోని ఫైటోఈస్ట్రోజెన్లు మూత్రపిండాల వైఫల్యం, కిడ్నీలో స్టోన్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. బాలింతలు, గర్భిణీ స్త్రీలు మీల్ మేకర్ తీసుకోకపోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.
సోయా చంక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు :
విరేచనాలు.
కడుపు నొప్పి.
అలెర్జీ.
సుదీర్ఘమైన ఋతుస్రావం.
తలనొప్పి.
కండరాలు మరియు ఎముకల నొప్పులు.
తలతిరగడం.
సొయా బీన్స్ కానీ ,మీల్ మేకర్ ని కానీ మితం గ తీస్కోడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అతిగా తీసుకోవడం అంటే రోజు తినడం వల్ల పైన చెప్పినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి
Share your comments