ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం,బట్టతల ఏర్పడడం ముఖ్యంగా ఈ సమస్య అబ్బాయిలను ఎక్కువగా వేధిస్తోంది.సాధారణంగా జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శారీరక మానసిక ఒత్తిడి,పోషకాహార లోపం, జన్యు పరమైన సమస్యలు,బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి కారణాలతో జుట్టు అధికంగా రాలి బట్టతల ఏర్పడుతుంది.ఈ సమస్య నుంచి బయట పడటం కోసం మార్కెట్లో లభించే అన్ని ప్రొడక్టులను వాడుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఆయుర్వేదంలో ఉందని చెప్పవచ్చు.
ఆయుర్వేద వైద్యంలో జామ ఆకులను ఉపయోగించి జుట్టురాలే సమస్యకు,కొత్త జుట్టు పెరిగేందుకు మంచి పరిష్కారం చూపబడింది. జామ ఆకులలో జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటుంది.ఇది జట్టు కుదుళ్లను దృఢంగా ఉంచి జుట్టు రాలడాన్ని అరికట్టి నల్లని ఒత్తయిన కురులు పొందడానికి సహాయపడుతుంది.మరి జుట్టురాలే సమస్యను అధిగమించడానికి జామ ఆకులను ఏవిధంగా వాడలో ఇప్పుడు తెలుసుకుందాం...
తాజా జామ ఆకులను తీసుకొని ఒక పాత్రలో ఉంచి అందులో తగినన్ని నీళ్లు పోసి దాదాపు 20 నిమిషాల పాటు ఆకులను మరిగించాలి. తర్వాత జామఆకు మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లు తడిసేలా 10 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. మర్దన చేసుకున్న రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.జామ ఆకులోని ఔషధ గుణాలు జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
Share your comments