Health & Lifestyle

మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వెంటనే తీసెయ్యండి లేదంటే పాములు వస్తాయి....

KJ Staff
KJ Staff

ఒత్తిడితో కూడుకున్న జీవితానికి గార్డెనింగ్ చెయ్యడం ద్వారా మంచి ప్రశాంతత మానశిక ఆనందం కలుగుతాయి. చాలా మంది తమ ఇళ్లవద్ద ఉన్నస్థలాన్ని మొక్కలపెంపకం కోసం కేటాయిస్తారు. ఈ గార్డెన్ని అనేక రకాల మొక్కలతో నింపేస్తారు. అయితే ఈ మొక్కలు మనుషులతో పాటు కొన్ని జీవరాశులను కూడా ఆకర్షిస్తాయి. కొన్ని రకాల మొక్కలు పాములను ఆకరిస్తాయి కాబట్టి ఈ మొక్కలు మీ పెరట్లో ఉంటె వెంటనే తీసెయ్యండి లేదంటే కాస్త అప్రమత్తంగా ఉండండి.

మల్లె:

మంచి సువాసన వచ్చే పూలలో మల్లె ప్రధానమైంది. ఈ పులకున్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని చాలా మంది మల్లె మొక్కలను తమ పెరట్లో పెంచుతారు. కొన్ని సమయాల్లో మల్లె మొక్క ప్రమాదకరం కావచ్చు. మల్లె మొక్క గుబురుగా పెరుగుతుంది మరియు దీని పూలు మంచి సువాసనను వెదజల్లుతాయి కాబట్టి పాములు ఈ వాసనకు ఆకర్శించబడి ఈ చెట్టు నీడలో తలదాచుకుంటాయి. కాబ్బటి ఈ మొక్కల దగ్గరకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వీలైతే ఈ మొక్కలను వర్షాకాలంలో తొలగించాలి.

నిమ్మ చెట్టు:

ఇంట్లో నిమ్మ చెట్టు ఉండడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అయితే నిమ్మ చెట్లు వానాకాలంలో మాత్రం ప్రమాదకరం కావచ్చు. సాధారణంగా నిమ్మచెట్టు చుట్టూ అనేక కీటకాల చేరుతూ ఉంటాయి, వీటితో పాటు పక్షులు మరియు ఎలుకలు కూడా ఈ చెట్టు వద్ద చేరడం వలన, పాములు ఆహారం కోసం నిమ్మచెట్ల వద్దకు వస్తాయి. కాబ్బటి వీటి వద్దకు చిన్నపిల్లలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.

దానిమ్మ:

దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చెట్టు యొక్క కాయలు, ఆకులు, మరియు వేర్లు అన్నిటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దానిమ్మ చెట్లు పాములకు నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ఒకటి. దానిమ్మ చెట్ల వద్ద పాములు ఎక్కువుగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఎన్నో రకాల కీటకాలను కూడా దానిమ్మ చెట్లు ఆకర్షిస్తాయి కాబట్టి వీటిని పెరట్లో లేదా ఇంటి చుప్పక్కల నాటడం శ్రేయస్కరం కాదు.

సైప్రస్ మొక్క:

పాపములను ఆకర్శించడంలో సైప్రస్ మొక్క ప్రధానమైంది. ఇది ఒక రకమైన అలంకరణ మొక్క కాబట్టి ప్రజలు దీనిని ఎక్కువుగా వారి ఇళ్లలో మరియు పెరట్లో నాటడం చూస్తుంటాం. ఈ మొక్కలు ఎంతో ఏపుగా పెరుగుతాయి కాబట్టి పాములు వీటి లోపలకి వెళ్ళినాసరే కనిపించవు. కాబట్టి వీటిని పెరట్లో లేదంటే ఇంట్లో పెంచడం మంచిది కాదు.

పచ్చని గడ్డి:

గుబురుగుగా పెరిగిన పచ్చని గడ్డి పాములు దాక్కోవడానికి మంచి ప్రదేశం. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇళ్ల ముందు కుత్రిమ గడ్డిని ఎక్కువుగా పెంచుతున్నారు. గడ్డి చిన్నగా ఉంటే సమస్య ఉండదు కానీ గుబురుగా మరియు పొడవాటి గడ్డి ఉంటె మాత్రం వెంటనే దానిని తొలగించండి. గడ్డిలో పురుగులు ఎక్కువుగా ఉంటాయి వాటిని తినడానికి పాములు ఈ గడ్డిలోకి తరచు రావడం గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి పొడవాటి గడ్డిని పెరగనివ్వకూడదు.

Related Topics

#Garden #Snakes #Shelter #Food

Share your comments

Subscribe Magazine