మార్కెట్ నుండి పళ్ళు తీసుకురాగానే వాటినే వెంటనే ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు, అందరి ఇళ్లలోనూ ఇదే పరిస్థితి. పళ్ళను ఫ్రిడ్జ్‌లో పెట్టడం ద్వారా అవి ఎక్కువు కాలం నిలువఉండటమే కాకుండా తినేసమయానికి ఫ్రెష్ గా ఉంటాయని భావిస్తారు. అయితే అన్ని రకాల పళ్ళు ఫ్రిడ్జ్‌లోని తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. అంతేకాకుండా పళ్ళను ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టడం ద్వారా వాటి రుచిని కూడా కోల్పోతాయి. అసలు ఏ పళ్ళను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ పళ్ళు:
జామ ఉష్ణమండలానికి చెందిన ఫలం. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు, ఎందుకంటే ఇవి తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టడం చేత ఇవి నీటిని కోల్పోయి క్రమంగా ఎండిపోతాయి. ఎక్కువ రోజులు జామకాయలను ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే ఇవి వీటి రుచిని కూడా కోల్పొతాయి. జామకాలయను ఫ్రిడ్జిలో పెట్టడం ద్వారా వాటిలో పోషకాలు కూడా కోల్పోయే అవకాశాం ఉంటుంది, కాబట్టి వీటిని ఫ్రిడ్జిలో పెట్టకూడదు.
అరటిపళ్ళు మరియు పనసపళ్ళు:
పనస మరియు అరటి రెండు ఉష్ణమండలాలకు చెందిన మొక్కలే, ఇవి తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటి రుచిని మరియు ఆకృతిని కోల్పోతాయి. ఉష్ణోగ్రత మరింత తక్కువగా ఉంటె పళ్ళు కూలిపోయినట్లు కనిపిస్తాయి. ఫ్రిడ్జిలోని తక్కువ ఉష్ణోగ్రత కారణంగా ఇవి వాటి సహజసిద్దమైన రుచిని మరియు వాసనను కోల్పోతాయి. అరటిపళ్ళు కాస్త పచ్చిగా ఉన్నపుడు కొనుగోలు చేసి వాటిని గది ఉష్ణోగ్రత వద్ద పండనిస్తే వాటి రుచి పాడవ్వదు మరియు ఎక్కువ కాలం వరకు నిలువ చెయ్యవచు.
మామిడి పళ్ళు:
ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని మరొక్క ఫలం మామిడి పండు. వీటిని ఫ్రిడ్జిలో పెడితే కొన్ని రోజులకి ముడుచుకుపోయి ఎండిపోయినట్లు కనిపిస్తాయి, అంతేకాకుండా రుచి కూడా తగ్గిపోతుంది. మామిడి పళ్ళను ఫ్రిడ్జిలో పెట్టకుండా గాలితగేలే చీకటి ప్రదేశాల్లో నిల్వచెయ్యలి, దీని వలన వాటి రుచి బాగుండటంతోపాటు ఎక్కువ కాలం వరకు నిల్వచెయ్యవచ్చు.
Share your comments