ఆరోగ్యంగా ఉండటానికి పళ్ళు ఎంతగానో దోహదపడతాయి. సహజసిద్ధంగా తియ్యగా ఉండే పళ్లలో, సహజసిధమైన చెక్కర ఉంటుంది. మనం ఉపయోగించే చెక్కెరతో పోలిస్తే పళ్లలోని చెక్కెరలో కొంత వ్యత్యాసం ఉంటుంది. పళ్ళు తియ్యగా ఉండటంతో వాటిలో చెక్కెర శాతం అధికంగా ఉంటుందని, షుగర్ ఉన్నవారు మరియు బరువు తగ్గాలనుకునేవారు వీటిని తినడానికి భయపడతారు. చెక్కెర ఎక్కువుగా ఉండే పళ్ళను తినడం ద్వారా వారి రక్తంలో కూడా చెక్కెర స్థాయి పెరుగుతుందని భయపడతారు. ఎటువంటి పళ్లలో చెక్కెర స్థాయి ఎక్కువుగా ఉంటుంది, అనే విష్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పళ్లలో రారాజుగా పిలవబడే మామిడి పళ్లలో చెక్కెర మిగిలిన ఫలాలతో పోలిస్తే ఎక్కువుగా ఉంటుంది. కేవలం వేసవి కాలంలోనే దొరికే మామిడి పళ్లకు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఫ్యాన్స్ ఉంటారు. అయితే మామిడి పళ్లలో చెక్కెర ఎక్కువుగా ఉండటం చేత షుగర్ వ్యాధి ఉన్నవారు వీటిని తక్కువుగా తినడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు కూడా మామిడి పళ్లకు కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఒక మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చెక్కెర ఉంటుంది, కాబట్టి మామిడి పళ్ళను ఎక్కువుగా తినకపోవడం ఉత్తమం.
ద్రాక్ష లేదంటే కిస్మిస్ వీటిలో కూడా చెక్కెర శాతం ఎక్కువుగానే ఉంటుంది. ద్రాక్ష పళ్ళు ఆరోగ్యానికి మంచివైనా ఎక్కువ మొత్తంలో తినడం అంత మంచిది కాదు. ఒక కప్పు ద్రాక్షలో సుమారు 23% చెక్కెర ఉంటుంది. కనుక ఎక్కువుగా ద్రాక్ష తినకపోవడం మంచిది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ద్రాక్ష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెర్రీ, పియర్స్, అరటి పళ్లలో కూడా చెక్కెర ఎక్కువుగానే ఉంటుంది. చెర్రీ పళ్ళు రుచిలో కాస్త పుల్లగా ఉన్నా వీటిలో మాత్రం చెక్కెర ఎక్కువుగానే ఉంటుంది. ఒక కప్పు చెర్రీ పళ్లలో 18 గ్రాముల చెక్కెర ఉంటుంది, కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకూడదు. అదేవిధంగా ఒక మీడియం సైజు పుచ్చకాయలో 17 గ్రాములు మరియు అరటి పళ్లలో 14 గ్రాముల చెక్కెర ఉంటుంది, కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మరియు డయాబెటిస్ ఉన్నవారు పళ్ళను తినేముందు జాగ్రత్త వహించాలి.
Share your comments