Health & Lifestyle

ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినకూడని ఆహారాలు!

S Vinay
S Vinay

ప్రస్తుతం ఉద్యోగ రీత్యా ఉన్న బిజీ వలన సమయానికి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో ఖచ్చితమైన నియమం లేకుండా పోయింది. సమయానికి ఏది తోస్తే అది తింటున్నాం.

అయితే ఇప్పుడు ఖాళీ కడుపుతో తినకుండా ఉండవలసిన ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందాం. కొన్ని ఆహార పదార్థాల వలన మంచి ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని సేవించే సమయాన్ని బట్టి మన జీర్ణ వ్యవస్థ స్పదింస్తుంది. మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఖాళీ కడుపున తీసుకుంటే విషమంగా మారే అవకాశం ఉంది.

శీతల పానీయాలు
మార్కెట్ లో అందుబాటులో ఉండే కూల్ డ్రింకులను ఖాళీ కడుపునా తాగటం వలన జీర్ణ క్రియ మందగించడమే కాకుండా శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎల్లప్పుడూ ఉదయం గోరువెచ్చని నీరు, లెమన్ టీ లేదా అల్లం టీ తాగడం తో మొదలుపెట్టండి.

ముడి కూరగాయలు
సలాడ్‌లు తినడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గవచ్చు, కానీ పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది.

నిమ్మ జాతి (సిట్రస్) పండ్లు
సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి మంచి పరిణామం కాదు ఖాళీ కడుపుతో వీటిని తింటే మీ జీర్ణవ్యవస్థ ​​అదనపు భారం పడుతుంది.

స్పైసి ఫుడ్
మనలో చాలా వరకి అందరికి స్పైసి ఫుడ్ అంటే చాలా ఇష్టం,కానీ ఈ ఇష్టాన్ని ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు పక్కన పెట్టండి. ఖాళీ కడుపున అధిక స్పైసి ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ ఏర్పడుతుంది.


మరిన్ని చదవండి.

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు మీరు ఊహించలేరు!

తేనె, నిమ్మరసం కలిపి తాగటం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో!

Share your comments

Subscribe Magazine