నిద్ర సుఖమెరుగదు అంటారు, అయితే చాలా మంది సుఖవంతమైన నిద్ర కోసం ఎన్నో ఇక్కట్లు పడుతుంటారు. నిద్రలేమితో బాధపడేవారికి శరీర సమస్యలతోపాటు, మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. రాత్రి మంచం మీద వాలిన వెంటనే నిద్రపట్టాలి అని చాలా మంది అనుకుంటారు, కానీ నిద్ర పట్టక సతమతమవుతుంటారు, ఇటువంటి వారు జీవనశైలిలో కొన్నిచిన్న చిన్న మార్పులు చేసుకుంటే సుఖంగా నిద్రపోగలరని నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఒక మనిషికి 7 గంటల నిద్ర అవసరం. అయితే చాలా మంది తగినంత సమయం నిద్రపోక నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి వారు నిద్రకు సంబంధించి ఒక క్రమశిక్షణ అలవరచుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. మొదటిగా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకునేవారు ఉదయాన్నే నిద్రలేవాలి, అలాగే సూర్యనమస్కారం చెయ్యడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడికి కారణమైన కార్టిసోల్ మరియు మెలటోనిన్ అనే రెండు హార్మోన్లను నియంత్రించడంలో సూర్యనమస్కారం ఎంతో సహాయపడుతుంది. సూర్య నమస్కారం చెయ్యడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యకమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
దీనితోపాటు రాత్రిపూట భోజనం కూడా సరైన సమయంలో చెయ్యాలి, సమయాన్ని పాటించకుంటే, ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే రసాయనాలు విడుదలలో జాప్యం మరియు అసమతుల్యత ఏర్పడతాయి. అలాగే భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు, భోజనానికి మరియు పడుకోవడానికి మధ్య కనీసం రెండు గంటలైనా సమయం ఉండాలి. పడుకోవడానికి మూడు ఫోన్లు మరియు టీవీ చూడటం తగ్గించాలి. దీనితోపాటు ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవాలి, దీనిని ఒక అలవాటుగా మార్చుకుంటే నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
చాలా మంది రాత్రిపూట టీ లేదా కాఫి తాగే అలవాటు ఉంటుంది, నిద్రలేమికి ఇది ప్రధాన కారణం, వీటిలో ఉండే కాఫ్ఫైన్ అనే పదార్ధం మెదడును ఉతేజపరిచేందుకు ఉపయోగపడుతుంది. దీని వలన నిద్రపోవడం కష్టంగా మారుతుంది. నిద్రలేమి సమస్య దూరం చేసుకోవాలి అనుకునేవారు క్రమబద్ధమైన జీవితాన్ని అలవరచుకోవాలి. ఇలా జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా నిద్రలేమిని అధిగమించవచ్చు.
Share your comments