గుడ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకు అంటే ఈ గుడ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. కానీ ఈ గుడ్లను తినేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ లో తాజా గుడ్లను మాత్రమే కాకుండా, పాడైపోయిన గుడ్లు కూడా విక్రయిస్తున్నారు. ఈ గుడ్లను తినడం వలన అనేక సమస్యలు వస్తాయి. కానీ వీటిలో తాజా గుడ్లను పాడయిన గుడ్లను గుర్తించడం కూడా చాలా కష్టం.
మనం తినే గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడ్లను మనం మంచి పౌష్టిక ఆహారంగా పరిగణించవచ్చు. ఒక సాధారణ గుడ్డులో సుమారుగా మనకి ఆరు గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. రోజుకు ఒక గుడ్డు తినడం ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గుడ్లు తినడం ద్వారా మనకు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గుడ్లు తినడం వలన కండరాల బలహీనత సమస్య నుండి బయటపడొచ్చు.
ఇది కూడా చదవండి..
రైతులకు జగన్ శుభవార్త..నెలలోపే పంట నష్ట సాయం అందించనున్న ప్రభుత్వం
పాడైపోయిన గుడ్లని ఎలా గుర్తించాలి మంచి గుడ్లు ఎలా ఎంపిక చేసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే, పాడైపోయిన గుడ్లను గుర్తించడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దానిలో గుడ్డు వేయండి. అలా వేసిన గుడ్లు కనుక ఆ గిన్నెలో అడుగుకు వెళ్ళిపోతే ఆ గుడ్లు తాజా పరిగణించవచ్చు.
అదే గుడ్డు ఒకవేళ మునగకుండా మధ్యలో నిలబడినట్లైతే అది పాడైపోయింది అని అర్థంచేసుకోవచ్చు. ఒకవేళ గుడ్లు కనుక పూర్తిగా తేలినట్లు అయితే ఆ గుడ్లను అస్సలు తినకూడదు. ఈ చిన్న పనితో మీరు పాడయిపోయిన గుడ్లను చాలా సులువుగా గుర్తించవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments