గత ఏడాది జూన్ నెలలో ఈపీఎఫ్ఓ లో చేరిన సభ్యుల సంఖ్య తో పోల్చి చూస్తే ఈ ఏడాది జూన్ నెలలో కొత్తగా చేరిన సభ్యుల సంఖ్య 5.53 లక్షలకు మించి ఉంది.
జూన్ నెలలో కొత్తగా చేరిన 18.36 లక్షల మంది సభ్యులలో 10.54 లక్షల మంది సామాజిక భద్రత అందిస్తున్న ఈపీఎఫ్, ఎంపీ చట్టం 1952 పరిధిలో ఈపీఎఫ్ఓ సభ్యత్వం తొలిసారిగా తీసుకున్నారు. 2022 నుంచి ఈపీఎఫ్ఓ లో చేరుతున్న సభ్యుల సంఖ్య పెరుగుతున్నది.
ఈపీఎఫ్ఓ నుంచి దాదాపు 7.82 లక్షల మంది నికర సభ్యులు నిష్క్రమించి, తిరిగి ఇపిఎఫ్ఓలో చేరారు. ఈపీఎఫ్ఓ లో పరిధిలోకి వచ్చే సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారు తమ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్నారు. చందాదారులు తుది పరిష్కారం కోసం కాకుండా తమ సభ్యత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాదిలో నెలవారీగా చేరిన సభ్యుల సగటుతో పోల్చి చూసే జూన్ నెలలో చేరిన సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది.
వయస్సు వారిగా సభ్యుల వివరాలు పరిశీలిస్తే జనవరి నెలలో ఈపిఎఫ్ఓ లో 22-25 మధ్య వయసులో ఉన్నవారు అత్యధికంగా సభ్యులుగా చేరారు. 22-25 మధ్య వయస్సు ఉన్న 4.72 లక్షల మంది ఈపీఎఫ్ఓ లో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే సంఘటిత రంగంలో తొలిసారిగా ఉపాధి పొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
“మత్స్యరంగం అభివృద్ధి పథకానికి టెక్నాలజీ అభివృద్ధి బోర్డు అండ” :తొలి అక్వాకల్చల్ ప్పాజెక్టుకు పూర్తిస్థాయి మద్దతు
రాష్ట్రాల వారీగా గణాంకాల విశ్లేషణ ప్రకారం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, మరియు ఢిల్లీ రాష్ట్రాలలో ఎక్కువ మంది సభ్యత్వం పొందారు. జూన్ నెలలో ఈపీఎఫ్ఓ సభ్యులుగా చేరిన వారిలో 12.61 లక్షల నికర సభ్యులు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, మరియు ఢిల్లీ రాష్ట్రాలకు చెందినవారు. మొత్తం చందాదారులు సంఖ్యలో వీరి సంఖ్య 68.66%గా ఉంది.
Share your comments