Health & Lifestyle

యూరిక్ ఆసిడ్ సమస్యకు సరైన పరిష్కారం ఈ డ్రైఫ్రూట్స్

KJ Staff
KJ Staff

కిడ్నీల పనితీరు తగ్గితే, శరీరంలో యూరిక్ ఆసిడ్ పెరిగిపోతుంది. ఈ రోజుల్లో యూరిక్ ఆసిడ్ పెరిగిపోవడం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ యూరిక్ ఆసిడ్ రక్తంలో మరియు శరీరంలో పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ యూరిక్ ఆసిడ్ ముఖ్యంగా కీళ్లు మరియు ఇతర శరీర భాగాల్లో పేరుకుపోయి సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఎంతో ప్రమాదకారియైన యూరిక్ ఆసిడ్ ను నియంత్రించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక యూరిక్ ఆసిడ్ తో బాధపడేవారు, ఈ డ్రై ఫ్రూట్స్ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

బాదాం:
బాదాం పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషకాలు ఉంటాయి. బాదాం పప్పును ప్రతిరోజు తినడం ద్వారా శరీరంలోని యూరిక్ ఆసిడ్ స్థాయిని తగ్గించుకోవచ్చు. బాదాం పప్పులో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది, అందువల్ల యూరిక్ ఆసిడ్ స్థాయి పెరగదు. అంతేకాకుండా బాదంపప్పులో విటమిన్-ఇ, మెగ్నీషియం, మరియు మాంగనీస్ సంవృద్ధిగా లభిస్తాయి, ఏవి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. బాదంపొట్టులోని యాంటీఆక్సిడెంట్లు, వివిధ రోగాలను దగ్గరకు రానియ్యకుండా చేస్తాయి. 

 

జీడిపప్పు:
అందరికి అందుబాటులో ఉండే డ్రైఫ్రూట్స్ లో జీడిపప్పు ఒకటి. జీడిపప్పుతో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీడిపప్పు తినడం ద్వారా యూరిక్ ఆసిడ్ నియంత్రణలో ఉంటుంది. జీడిపప్పులో శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి. 
వాల్నాట్స్:
మనిషి మెదడు ఆకారంలో ఉండే ఈ వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి, ముఖ్యంగా యూరిక్ ఆసిడ్ సమస్యతో బాధపడేవారికి వాల్నట్స్ ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ తగినంత పరిమాణంలో ఉంటాయి. వాల్నట్స్ లోని యాంటీఇంఫ్లమ్మెటరి లక్షణాలు శరీరంలోని అనేక సమస్యలను నయం చెయ్యడంలో సహాయం చేస్తాయి. 
పిస్తాపప్పు:
పిస్తాపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరమైనంత పరిమాణంలో ఉంటాయి. పిస్తాపప్పులో ఫ్యూరిన్ తక్కువ  పరిమాణంలో ఉంటుంది, ఇది శరీరంలో పేరుకుపోయిన యూరిక్ ఆసిడ్ ను బయటకి పంపించడంలో సహాయం చేస్తుంది. పిస్తా పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. 

Share your comments

Subscribe Magazine