కొద్దిగా పనిలో అధిక ఒత్తిడి కలిగిన, లేదంటే తలనొప్పి వచ్చినా ఒక కప్పు చాయ్ తాగనిదే చాలామందికి అలసట నుంచి విముక్తి పొందలేరు. అదేవిధంగా మన దేశంలో మంచి నీటి తర్వాత అత్యధికంగా తాగుతున్న పానీయాలలో ఏదైనా ఉంది అంటే అది కేవలం టీ మాత్రమే. ఈ విధంగా చాలామంది రోజుకు నాలుగైదు కప్పుల టీ తాగుతూ ఉంటారు.ఈ విధంగా అధిక సంఖ్యలో టీ తాగడం వల్ల కొన్ని రకాల సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అని నిపుణులు తెలియజేస్తున్నారు. అధిక మొత్తంలో టీ తాగడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
మనం తాగే టీ పొడిలో అధిక మొత్తంలో నికోటిన్, కెఫిన్ వంటి పదార్థాలు ఉండటం వల్ల ఇవి కడుపులో గ్యాస్ ఉత్పత్తికి కారణం అవుతాయి. ఈ క్రమంలోనే రోజుకో అధిక మొత్తంలో చాయ్ తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఏ ఇతర ఆహార పదార్థాలను తినకుండా కేవలం టీ మాత్రమే తాగితే కడుపులో వికారం కలుగుతుంది.చాలామంది అలసట చెందినప్పుడు ఒక కప్పు టీ తాగటం వల్ల వారికి ఎనలేని ఎనర్జీ వస్తుందని చెబుతుంటారు. అయితే టీ తాగటం వల్ల ఎంత తొందరగా అయితే ఎనర్జీ వస్తుందో అంతే తొందరగా నీరసించిపోతారు.
ఇటీవల కాలంలో చేసిన పరిశోధనలో భాగంగా అధిక మొత్తంలో చాయ్ తాగే వారిలో తీవ్రమైన కీళ్ళ నొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధనలలో వెల్లడైంది.టీ పౌడర్ లో ఉన్న కొన్ని రకాల పదార్థాల కారణంగా మన ఎముకలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అని ఈ అధ్యయనం వెల్లడించింది. చాలామంది వేడివేడిగా ఉన్నటువంటి టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ విధమైనటువంటి వేడి టీ తాగటం వల్ల భవిష్యత్తులో జీర్ణక్రియ వ్యవస్థ పనితీరు పై అధిక ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో గొంతు క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.అందుకోసమే కేవలం రోజుకు రెండు లేదా మూడు సార్లకు మించి టీ తాగడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Share your comments