ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కి అలవాటు పడడం దానికి తోడు తగిన శారీరక శ్రమ లేకపోవడం,జన్య పరమైన సమస్యలు వంటి తదితర కారణాల వల్ల శరీర బరువు పెరగడంతో చాలామందిలో ఊబకాయు సమస్య రోజురోజుకీ పెరుగుతోంది.ఈ సమస్య మరీ తీవ్రమైతే భవిష్యత్తులో అనేక రకాల వ్యాధులకు కారణం కావచ్చు. శరీర అధిక బరువు సమస్యను అధిగమించడానికి ప్రతిరోజు
మనం తీసుకునే ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తూ స్వల్ప శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక వంటివి తప్పనిసరి చేసుకోవాలి.
అతి బరువు సమస్య ఉన్నవారు రాత్రి భోజన సమయంలో, భోజనం తర్వాత కొన్ని చిట్కాలు పాటించి తమ శరీర బరువు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు అని కొందరు వైద్యులు సూచిస్తున్నారు అవేమిటో ఇప్పుడు చూద్దాం....
రాత్రి భోజనాన్ని సాధ్యమైనంతవరకు 7 గంటలలోపు కంప్లీట్ చేసుకోవాలి. రాత్రి భోజనంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.అధిక కార్బోహైడ్రేట్ ,ప్రోటీన్, కొవ్వు కలిగిన ఆహారం తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులతో పాటు అతి బరువు సమస్యకు కారణం కావచ్చు.
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. దీని వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య కూడా ఊబకాయ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గోరువెచ్చని పాలు తాగడం వల్ల సుఖ ప్రదమైన నిద్ర కలుగుతుంది.అలాగని మితిమీరిన నిద్ర కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయడం, అధికంగా నీరు తాగడం వంటివి అస్సలు చేయకూడదు.
Share your comments