సాధారణంగా మన చుట్టూ ఉన్న పరిసరాలలో పెరిగే వివిధ రకాల మొక్కలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిఒక్క ఇంటి ఆవరణంలో తులసి చెట్టు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వాము మొక్కను కూడా పెంచుతారు. ఈ వాము ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ వాము ఆకులలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ లతోపాటు ఎన్నో, ప్రొటీన్లు, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ వాము ఆకు తినడం వల్ల సమస్యలను దూరం చేయవచ్చు.
సాధారణంగా మనం తీసుకున్న ఆహారం కారణంగా కడుపులో నొప్పి ఉబ్బరం అనిపించిన వెంటనే చాలామంది మన ఇంట్లో వంటింట్లో దొరికే చిటికెడు వామును నోట్లో వేసుకొని తినడం చూస్తుంటాం. ఈ విధంగా వాము తినడం ద్వారా తొందరగా కడుపు ఉబ్బరం, నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు.వాములో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో వాము ఆకులో కూడా మనకు అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ వాము ఆకులను తరచూ తింటూ ఉండటం వల్ల ఉదర సమస్యలు తొలగిపోతాయి.
చాలా మందిలో అజీర్తి, గ్యాస్ ట్రబుల్, వంటి లక్షణాలతో బాధపడుతూ కడుపు ఉబ్బరంగా ఉంటుంది.ఈ క్రమంలోనే మలబద్ధక సమస్య కూడా తీవ్రంగా వెంటాడుతుంది.ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు రెండు ఆకులను నమలడం ద్వారా తొందరగా మలబద్దక సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా కడుపు ఉబ్బరం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ వాము ఆకుల ద్వారా చాలామంది బజ్జీలు వేయించి తినడం, పలు పచ్చడి తయారుచేసుకుని తినడం వంటివి చేస్తుంటారు.
Share your comments