సాధారణంగా మన శరీర ఎదుగుదలకు, మన శరీరంలో కణజాల ఉత్పత్తికి, మన శరీరానికి శక్తిని ప్రసారం చేయటానికి ప్రొటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తాము. జుట్టు రాలిపోకుండా దృఢంగా పెరగాలన్న ప్రొటీన్లు ఎంతో అవసరం. మన శరీరానికి ప్రొటీన్లు అవసరం ఎంతో ఉంది కనుకశరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లను పొందాలంటే తప్పనిసరిగా చాలామంది గుడ్లు మాంసం వంటి మాంసాహార పదార్ధాలను తింటారు. వీటిలో అధిక మొత్తంలో ప్రొటీన్లు లభ్యమవుతాయి అని చాలామంది భావిస్తారు.అయితే ప్రొటీన్లు కేవలం మాంసాహారంలో మాత్రమే కాకుండా శాకాహారంలో కూడా అధిక మొత్తంలో ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. మరి ఏ విధమైనటువంటి శాకాహార పదార్థాలలో అధిక మొత్తంలో ప్రొటీన్లు లభ్యమవుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
శాఖాహారలో ఒకటైన వేరుశెనగను ప్రొటీన్ల సమ్మేళనం అని చెప్పవచ్చు. కేవలం అర కప్పు వేరుశెనగలో 20 గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు రోజు అరకప్పు వేరుశనగను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అదే విధంగా వివిధ రకాల పప్పుధాన్యాలలో కూడా మనకు ప్రొటీన్లు లభిస్తాయి. ఒక కప్పు పప్పుధాన్యాల లో 18 గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. కనుక ప్రొటీన్లను సరైన మోతాదులో పొందాలంటే పప్పు ధాన్యాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.
బాదంపప్పు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.బాదంపప్పులో ప్రొటీన్లతో పాటు ఎన్నో పోషకాలు మనకు లభ్యమవుతాయి కనుక ప్రతిరోజూ నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినడం వల్ల ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. సోయా పన్నీర్ సోయా పాలతో తయారుచేసిన పన్నీర్ ను టోపు పన్నీర్ అని పిలుస్తారు. చాలామంది ఈ పన్నీర్ తినడానికి ఇష్టపడరు. అలాంటివారు సోయాబీన్స్ తినడం వల్ల అధిక మొత్తంలో ప్రొటీన్ల మన శరీరానికి అందుతాయి.శాకాహారం మాత్రమే తినేవారు ఈ విధమైనటువంటి పదార్ధాలను తరచుగా తినడం వల్ల అధిక మొత్తంలో వారి శరీరానికి కూడా ప్రొటీన్లు అందుతాయని చెప్పవచ్చు.
Share your comments