డిజిటల్ సేవలవైపు వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే UPI పేమెంట్ విధానం తో ప్రజలను బ్యాంకింగ్ మరియు ఆన్లైన్ సేవలపై ఆధారపడేవిధంగా చేయడంలో సఫలమైనది . ఆన్లైన్ పేమెంట్ విషయం లో మరో ముందగు వేస్తూ డిజిటల్ కరెన్సీ ని రూపొందిస్తు గత నెల లో హోల్‌సేల్ ,మరియు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు డిజిటల్ కరెన్సీ ని ఉపయోగిస్తూ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది .
హోల్‌సేల్ మార్కెట్లో ప్రయోగాత్మకంగా విడుదల చేసిన డిజిటల్ రుపీని రిజర్వ్‌బ్యాంక్ గురువారం నుంచి ప్రజల మధ్యకు తేనున్నట్లు RBI వెల్లడించింది . ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్‌లు పాల్గొంటాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అయిన రిటైల్ (e-R) నిర్వహణ పద్ధతిని మంగళవారం ఆర్బీఐ ప్రకటించింది.
నెల రోజుల క్రితం పైలట్ ప్రాజెక్టును RBI డిజిటల్ కరెన్సీ విభాగం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC ) మొదట ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో అమలు చేసారు . దశలవారీగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం 8 బ్యాంక్‌ల్ని ఆర్బీఐ ఎన్నుకుంది . మొదటిదశలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ, యస్ బ్యాంక్‌లు e-R లను, వాలెట్లను పంపిణీ చేస్తాయి.
Digital currency:డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి? దీనిని ఎవరు నిర్వర్తిస్తారు !
డిజిటల్ కరెన్సీ ఎలా వాడాలి ?
బ్యాంకులు ఖాతాదారులకు డిజిటల్ కరెన్సీ వాలెట్ లను జారీ చేస్తాయి .
ప్రతి ఖాతాదారుడు కూడా డిజిటల్ కరెన్సీ కరెన్సీ ఉపయోగించవచ్చు .
వాటిని మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో స్టోర్ చేసుకోవచ్చు.
ఈ వాలెట్ ద్వారా e-Rల్లో యూజర్లు లావాదేవీలు జరపవచ్చు.
వ్యక్తి నుంచి వ్యక్తి (పీ2పీ), వ్యక్తి నుంచి వ్యాపారి (పీ2ఎం) మార్పిడి చేసుకోవచ్చు.
మర్చెంట్ లోకేషన్లలో ఉన్న క్యూఆర్ కోడ్స్‌ను ఉపయోగించి వ్యాపారులకు చెల్లింపు చేయవచ్చు.
నగదు తరహాలానే e-R లపై వడ్డీ లభించదు. కానీ FD చేసుకోవచ్చు .
బ్యాంక్ డిపాజిట్లు వంటి ఇతర డబ్బు రూపాల్లోకి మార్చుకోవచ్చు.
Share your comments