వెల్లుల్లికి భారతీయ వంటకాలతో విడదియ్యలేని బంధం ఉంది. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెల్లుల్లిని ప్రతిరోజు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లిని తినడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, దీనివలన బీపీ మరియు గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లిలో ఉండే పోషకవిలువలు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జుట్టు బలంగా పెరిగేందుకు దోహదపడతాయి. రక్తపోటు అధికంగా ఉండేవారికి కూడా వెల్లుల్లి మేలు చేస్తుంది. మనం రోజు తినే ఆహారంలో మనకు తెలియని ఎన్నో టాక్సిన్స్ కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి, వీటిని బయటకి పంపించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.
వంటల్లో వెల్లుల్లిని వాడటం వలన, ఆహారపదర్ధాలకు మంచి రుచి, సువాసన లభిస్తాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియాల్ లక్షణాలు ఎన్నో రకాల రోగాల నుండి మనల్ని రక్షిస్తుంది. వెల్లుల్లికి ఆహార ప్రయోజనాలతోపాటు, ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల ఆయుర్వేదం మందుల్లో వెల్లుల్లిని వినియోగిస్తారు. అంతేకాకుండా వెల్లుల్లికి కాన్సర్ నయం చేసే లక్షణాలు కూడా ఉన్నాయి.
వెల్లుల్లిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని పచ్చిగా తినడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని తినకపోవడం మంచిది. ఉదరసంబంధిత వ్యాధులు ఉన్నవారు మరియు అసిడిటీ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకపోవడం మంచిది. అయితే పరగడుపున పచ్చి వెల్లుల్లి తింటే మంచిదని చాలా చోట్ల ప్రచారం జరుగుతుంది, ఇలా చెయ్యడం ద్వారా జీర్ణసమస్యలు తలైతే ప్రమాదం ఉంటుంది. అసిడిటీ తో బాధపడేవారు ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటే అల్సర్ వంటి సమస్యలు తలైతే ప్రమాదం ఉంటుంది.
మరోపక్క చర్మ సమస్యలతో బాధపడేవారు కూడా పచ్చి వెల్లుల్లిని తినకపోవడమే మంచిది, వెల్లుల్లిలోని కొన్ని కంపౌండ్లు చర్మ సమస్యలను మరింత ఎక్కువ చేస్తాయి. వెల్లుల్లి రక్తాన్ని పలుచబడేలా చేస్తుంది, కాబట్టి సర్జరీ జరిగిన వారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు, ఒకవేళ తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. వీరితోపాటుగా, రక్థహీనత, తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా పచ్చి వెల్లుల్లిని తినకపోవడం చాలా మంచిది. అయితే పచ్చి వెల్లుల్లికి బదులుగా కూరలో వేసే వెల్లుల్లిని తింటే మాత్రం ఎటువంటి ప్రమాదం ఉండదు.
Share your comments