ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
భారతదేశం, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మధుమేహ జనాభాకు నిలయంగా మారింది. ప్రపంచంలో మధుమేహం ఉన్న ప్రతి ఆరు వ్యక్తుల్లో ఒకరు భారతీయుడే. గత మూడు దశాబ్దాలలో దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150 శాతం పెరిగింది" అని ICMR తెలిపింది.
టైప్ 1 డయాబెటిస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి, ఇది ఇన్సులిన్ లోపం మరియు తల్లిదండ్రులకి వ్యాధి చరిత్ర ఉన్నప్పుడు టైప్ 1 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఇన్సులిన్ లేకుండా, రక్తంలో చక్కెర కణాలలోకి ప్రవేశించదు మరియు రక్తప్రవాహంలో పేరుకుపోతుంది.
ఇంతకుముందు టైప్ 2 డయాబెటిస్ పెద్దవారిలో ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఇది పిల్లలలో తరచుగా కనిపిస్తుంది. జీవనశైలి విధానం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పిల్లలలో పెరుగుతున్న డయాబెటిస్ కేసులకు కారణమని చెప్పవచ్చు. భారతదేశంలో 1,28,500 మంది పిల్లలు మరియు యుక్తవయస్కులు మధుమేహంతో బాధపడుతున్నట్లు నివేదించబడింది. అలాగే, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో దాదాపు 97,700 మంది పిల్లలు టైప్ 1 డయాబెటిస్తో బాధపడుతున్నారు. అంతేకాకుండా, డబ్ల్యూహెచ్ఓ 2021 డిసెంబర్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న భారతీయ జనాభాలో 95 శాతానికి పైగా టైప్ 2 డయాబెటిస్‌కు గురయ్యే అవకాశం ఉంది.
WHO తన నివేదికలో, ఆరోగ్యకరమైన ఆహారం మరియు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదని పేర్కొంది. అందువల్ల, సరైన ఆహారం యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పించడం మరియు దీర్ఘకాలంగా ప్రయోజనం చేకూర్చే జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహహించాలి.
మరిన్ని చదవండి.
Share your comments