పిల్లలో తరచు ఎదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతూనే ఉంటుంది, పిల్లలు శుభ్రత పాటించకపోవడం దీనికి ప్రధాన కారణం. చిన్న పిల్లలో ఎక్కువుగా గమనించే సమస్యల్లో నులిపురుగుల సమస్య కూడా ఒకటి. ఈ నులిపురుగులు సమస్య రావడానికి కూడా అపరిశుభ్రతే కారణం. పిల్లలు ఎక్కువుగా దుమ్ము, ధూళి మట్టిలో ఆదుకోవడం, ఈ నులిపురులుగు రావడానికి ప్రధాన కారణం.
నులిపురుగులు గుడ్లు చాలా ఏళ్ల వరకు అలానే ఉంటాయి. పిల్లలన్నాక ఎక్కువగా మట్టిలోనే ఆడుకుంటూ ఉంటారు, అటువంటి సమయంలో మట్టిలోని గుడ్లు పిల్లల చేతి గోర్లలో చేరుతాయి. పిల్లలు చేతులు సర్రిగా శుభ్రం చేసుకోకుండా ఆహారం తిన్నపుడు ఇవి వారి శారీరంలోకి చేరి గుడ్లు పురుగులు బయటకు వస్తాయి. నులిపురుగులు ఎక్కువుగా ఉన్న పిల్లలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి, వాటిలో రక్థహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తీ తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం మొదలైనవి ప్రధానమైన లక్షణాలు. ఈ నులిపురుగులు మరీ ఎక్కువుగా ఉంటే మానశిక ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపుతుంది.
పిల్లల్లో నులిపురుగులు సమస్య రాకుండా ఉండేందుకు భోజనం తినే ముందు మరియు మల విసర్జన చేసిన తరువాత చేతులు శుభ్రంగా కడుకోవడం నేర్పించాలి. పిల్లలు మట్టిలో ఆదుకున్న తరువాత శుభ్రంగా స్నానం చెయ్యడం అలవాటు చెయ్యాలి. ముఖ్యంగా గోర్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం మరియు గోర్లలోని మట్టిని శుభ్రం చేసుకోవడం అలవాటు చెయ్యాలి.
నులిపురుగులు సమస్య ఎక్కువైతే పిల్లలో ఏకాగ్రత దెబ్బతిని చదువు మీద దృష్టి పెట్టలేరు. ఈ నులిపురుగులని నివారించడానికి పిల్లలకి ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వాలి. ఈ మాత్ర వలన నులిపురుగులు తొలగిపోవడమే కాకుండా రోగనిరోధక శక్తీ కూడా పెరుగుతుంది. పిల్లలకి కనీసం 6 నెలలకు ఒకసారైనా ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏడాది వయసున్న పిల్లల దగ్గర నుండి 19 సంవత్సరాలు వచ్చే వరకు ఈ టాబ్లెట్స్ ఇవ్వొచ్చు.
Share your comments