మన దేశంలో ప్రతి సంవత్సరం ఎంతో మంది అనేక కారణాల వల్ల చనిపోతున్నారు. ఎక్కువ అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయిన వారిలో ఎక్కువగా గుండె జబ్బులు, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ తరువాత బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా మూడో మరణం సంభవిస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. ప్రతి ఏటా మన దేశంలో 7.4 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురించిన అధ్యయన నివేదికలో భాగంగా అల్జీమర్స్-చిత్తవైకల్యం , ఎన్సెఫాలిటిస్ ,నాడీ సంబంధిత రుగ్మతలలో స్ట్రోక్ తర్వాత అత్యధిక మరణాలు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల సంభవిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే 2019వ సంవత్సరంలో జరిగిన పలు అధ్యయనాల ప్రకారం మన దేశంలో ఏకంగా 48 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన మైగ్రేన్, సాధారణ తలనొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు.ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ విధమైన సమస్యలు అధికంగా ఉన్నాయని దీని ద్వారా మెదడు సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు తెలియజేశారు.
ఈ బ్రెయిన్ స్ట్రోక్ కు సంబంధించిన అధ్యయనాలలో భాగంగా ఎక్కువగా వెస్ట్ బెంగాల్, చత్తీస్ గడ్ రాష్ట్రాలలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు అత్యధిక సంఖ్యలో ఉన్నట్లు తెలియజేశారు.అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే ఈ విధంగా బ్రెయిన్ స్ట్రోక్ నివారించడానికి వీలైనంత వరకు ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.మన మెదడులోకి రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులలో ఏదైనా సమస్య కారణంగా రక్తప్రవాహం జరగనప్పుడు మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ఏర్పడుతుంది. ఫలితంగా ఇది మరణానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Share your comments