ప్రతి మనిషికి ఒక్కో రకం బ్లడ్ గ్రూప్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్‌లలో ముఖ్యమైనవి ఎ,బి,ఓ మరియు ఎబి రకాలు. ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు మరియు సర్జరీ సమయంలో రక్తం అవసరం అయినప్పుడు పేషెంట్ బ్లడ్ గ్రూప్ ని బట్టి కొత్త రక్తం ఎక్కిస్తారు.
బ్లడ్ గ్రూప్స్ జన్యుపరమైనవి, తల్లిదండ్రుల నుండి సంక్రమించే జన్యువుల్లో బ్లడ్ గ్రూప్ ఒకటి. అయితే తాజాగా కొంతమంది వైద్యనిపుణులు మరియు పోషకాహార నిపుణులు బ్లడ్ గ్రూప్ బట్టి కూడా కొన్ని వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉందని మరియు ఆ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు పాటించవలసిన పరిష్కారమార్గాల గురించి వివరించారు.
మొదటిగా ఎ, బి బ్లడ్ గ్రూప్ కలిగిఉన్నవారికి గుండె జబ్బలు వచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు పేర్కొన్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉంటే గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ రెండు బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అంతేకాకుండా రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే ప్రోటీన్లు ఎక్కువుగా ఉండటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు త్వరగా రావడానికి అవకాశం ఎక్కువ. ఇందుకుగాను ఎ,బి బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు క్రమంతప్పకుండా వ్యాయామం చెయ్యాలి, కాలుష్యం ఎక్కువుగా ఉండే ప్రదేశాలకు వీలైనంత తక్కువ వెళ్లడం మంచిది. ధూమపానం అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోండి అలాగే సమయానుసరంగా గుండె పనితీరును చెక్ చేపించుకోండి.
చాలాకొద్ది మందిలో మాత్రమే ఉండే బ్లడ్ గ్రూప్స్ లో ఓ బ్లడ్ గ్రూప్ ఒకటి. ఈ రకం బ్లడ్ గ్రూప్ వారికీ గుండె వజబ్బులు వచ్చే అవకాశం తక్కువ, అయితే ఉదర భాగానికి సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువుగా ఉంటుంది, వీరికి పేగుల్లో మరియు పుళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది, వీటినే స్టొమక్ అల్సర్స్ అనికూడా పిలుస్తారు, కనుక ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే వీరికి చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువుగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు, కాబట్టి, ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఆహారంలో అధిక పోషకవిలువలు ఉండే ధాన్యాలు, చేపలు, పళ్ళు, మరియు కూరగాయలు చేర్చుకోవాలి.
ఎ బ్లడ్ గ్రూప్ ఉన్నవ్యక్తుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ అనే హార్మోన్ దీనికి ప్రధాన కారణం. వీరిలో మానశిక ఆందోళనలు మరియు మానశిక వ్యాధులు ఎక్కువుగా రావడానికి అవకాశం ఉంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి వ్యాయామం మరియు యోగ చెయ్యడం మంచిది, అలాగే రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి. చివరిగా ఎబి బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో వయసు పైబడే కొద్దీ ద్రుష్టి లోపంతలెత్తవచ్చు. రక్తంలో ప్రోటీన్ లోపం వల్ల జ్ఞాపక శక్తీ కూడా మందగిస్తుంది, కనుక ద్రుష్టి లోపం తలెత్తకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి, మరియు ఆహారంలో ప్రోటీన్ శాతం అధికంగా ఉండేలా చర్యలు పాటించాలి.
Share your comments