ఆధునిక జీవనశైలి జీవన ప్రమాణాలను చాల వరకు ప్రభావితం చేస్తుంది. పోటీప్రపంచంలో నెట్టుకొచ్చేందుకు, ప్రపంచంతో కలిసి ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతటిది ఒత్తిడితో కూడుకున్న జీవితంలో మానశిక ఆనందం మీద మరియు ఆరోగ్యం మీద ద్రుష్టి సారించవల్సిన అవసరం ఉంది. ప్రకృతుతో మమేకమవ్వడం మూలాన మానసిక ఉల్లాసం, ప్రశాంతత పెరుగుతాయి.
మనమంతా ప్రకృతిలో ఒక భాగమే, మన ఉనికిని నిలిపేది ప్రకృతి. కానీ మనలో చాల మంది అనేక కారణాల వల్ల ప్రకృతికి దూరంగా గడిపేస్తున్నారు. ప్రకృతితో గడపడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. మానసిక వికాసం అందిచడంలో ప్రకృతి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
నేటి తరం, వయసుతో సంభందం లేకుండా, ప్రతీ ఒక్కరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, వీటిలో ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. ఒత్తిడి కారణంగా ఆంక్సిఐటీ పెరిగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇటువంటి సమస్యలతో భాదపడుతున్నవారు, సమయం దొరికినప్పుడల్లా ప్రకృతిలో గడిపితే ఒత్తిడి చాల వరకు తగ్గుతుంది. శరీరం ఆరోగ్యం ఉండాలంటే వ్యాయామం ఎంతో అవసరం, ఉద్యోగాల్లో ఉండే టెన్సన్స్ వలన చాల మందికి వ్యాయామం చేసే సమయం దొరకట్లేదు. ఇటువంటి వారు ఉదయాన్నే కొద్దిసేపైనా పార్క్స్ లో జాగింగ్, వాకింగ్ చేస్తే, అటు శరీరానికి వ్యాయామం లిభిస్తుంది, మరోవైపు ప్రకృతిలో గడిపినట్లు అవుతుంది. ఉదయానే వచ్చే సూర్యకిరణాలు ద్వారా మన శరీరానికి విటమిన్-డి లభిస్తుంది, ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
పెద్ద వారు కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలతో భాధపడేవారు, ప్రకృతిలో ఎక్కువుగా గడిపితే ఈ సమస్యలు దూరమవుతాయని పరిశోధన సూచిస్తుంది. అంతే కాకుండా ప్రకృతిలో ఎక్కువుగా ఉండే వారు ఎంతో హుషారుగా, ఆరోగ్యంగా కనిపిస్తారు. ఇంట్లో చేసే వ్యాయామం కన్నా ప్రకృతిలో చేసి వ్యాయామానికి ఎక్కువ ఉపయోగాలు ఉన్నట్లు పరిశోధలను సూచిస్తున్నాయి.
Share your comments