సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన లవంగం గురించి తెలియనివారుండరు. లవంగాలని బిర్యానీలో, కూరల్లో మరియు మసాలా తయారీలోనూ వాడుతారు. భారతీయ వంటకాలకు, లవంగంతో విడదీయలేని సంబంధం ఉంది. లవనగంలో శరీరానికి ఆరోగ్యనిచ్చే ఔషధ గుణాలుకూడా ఉన్నాయి. లవంగాన్ని రోజుతినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని కొన్ని అధ్యయనాల్లో పేర్కొన్నారు.
లవంగాలను నమలడం వలన నోటి ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండచ్చు. వీటిలో ఉండే యూగెనోల్ అనే కెమికల్ యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ ఏజెంట్ గా పనిచేసి నోటిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నియంత్రించగలిగే శక్తీ ఈ యూగేనోల్ కు ఉంది. నోటి నుండి దుర్వాసన రాకుండా లవంగం నియంత్రించగలదు.
నోటిలోని ఇన్ఫెక్షన్స్ నియంత్రించడంతో పాటు, లవంగంలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫలావోనోయిడ్స్, ఇసాఫ్లవోన్స్ వంటివి రోగాల భారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. ఇవి రెండు మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ తొలగించడంలోనూ ఉపయోగపడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి కాన్సర్ క్యాన్సర్ కారకాలు. ఇవి కణం యొక్క ప్రక్రియకు ఆటంకం కలిగించి క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి.
లవంగాలలో మరొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇవి యాంటీఇంఫ్లమేటరీ ఏజెంట్స్ లాగా పనిచేసి శరీరంలో వచ్చే ఇంఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్లు మరియు మొక్కల నొప్పులు ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగకరం. భోజనం చేసిన తర్వాత లవంగాలను తినడం ద్వారా జీర్ణక్రియ కు సంభందించిన ఎంజాయ్ లు విడుదలయ్యి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా లవంగాలను రోజుకు 3-4 మించి తినడం హానికరం. లవంగంలో ఉండే కొన్ని ఏంజైములు రక్తం పలుచబడేలా చేస్తాయి.
Share your comments