ఉల్లి చేసిన మేలు తల్లికూడా చెయ్యదు అని ఒక నానుడి ఉంది. ఉల్లి మన శరీరానికి చేసే ఉపకారాల గురించి తెలుసుకుంటే ఈ సామెత నిజం అనిపిస్తుంది. మన భారతీయ వంటకాల్లో ఉల్లిపాయకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉల్లిపాయతో చేసిన ప్రతి వంటకానికి ఒక వైవిధ్యమైన రుచి వస్తుంది మరేఇతర కూరగాయ అయినా సరే ఉల్లిపాయ స్థానాన్ని భర్తీ చెయ్యలేదు. భారత దేశంతో పాటు ఇతర దేశంలోని వంటకాల్లో కూడా ఉల్లిపాయని తరచు వినియోగిస్తూ ఉంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయ ఈ వేసవి కాలంలో తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
హైడ్రేషన్ మరియు ఎలెక్ట్రోలైట్ బాలన్స్:
మన తెలుగు రాష్టాల్లోని చాల మంది ప్రజలు, ఉదయాన్నే, పెరుగు అన్నంతో ఉల్లిపాయను తినడం గమనించవచ్చు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లే వారు దీనిని అధికంగా తింటుంటారు. పెరుగన్నంలో ఉల్లిపాయను తినడం ద్వారా కడుపు నిండుగా ఉంది రోజంతా అలసట లేకుండా వారు పనిచెయ్యగలరు, దీనికి ముఖ్య కారణం ఉల్లిపాయ మన శరీరాన్ని హైడ్రేట్ చెయ్యడంలో తోడ్పడుతుంది, అలాగే చమట ద్వారా కోల్పోయిన, ఎలెక్ట్రోలైట్స్ బ్యాలన్స్ చేయడంలో సహాయపడుతుంది.
శరీరంలో వేడిని తగ్గిస్తుంది:
వేసవి కాలంలో, బయట ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం మూలాన, శరీర ఉష్ణోగ్రత సాధారణంకంటే అధికంగా నమోదవుతుంది. ఉల్లిపాయలో సహజంగా ఉండే క్యూర్సీటిన్, సల్ఫర్ కంపౌండ్స్ శరీరం ఉష్ణోగ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కనుక వేసవి కాలంలో సలాడ్ల రూపంలో, మరియు ఇతర ఆహార పదార్ధాలలో ఉల్లిపాయ ఉండేటట్లు చూస్కోండి.
యాంటీఆక్సిడాంట్స్:
ఉల్లిపాయతో పుష్కలంగా దొరికే యాంటీఆక్సిడెంట్లు, కణాల నష్టాన్ని, మరియు ఇంఫ్లమేషన్ తగ్గించడానికి ఎంతో అవసరం, మరియు ఉల్లిపాయతో ఉండే విటమిన్-సి శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. అంతేకాకుండా యూవీ కిరణాల నుండి మన చర్మానికి రక్షణగా నిలుస్తుంది.
అరుగుదల శక్తిని పెంచుతుంది:
సాధారణంగా వేసవి కాలంలో అరుగుదల మందగిస్తుంది, ఇదే సమయంలో అనేక ఉదార సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉల్లిపాయతో దొరికే డైటరీ ఫైబర్స్ తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి, మరియు ఉల్లిపాయతో ప్రోబైయటిక్స్ పొట్టలోని ఉపయోగకరమైన బాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయం చేస్తుంది.
- Read More:
-
అందం, ఆరోగ్యం సాధించడం బెండకాయతోనే సాధ్యం
Share your comments