ఈ మధ్యకాలంలో ఒత్తిడి అందరికి ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఒత్తిడి కారణంగా ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం బాగుండాలంటే మనసును మరియు మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో ఒడిదుకులని సమర్ధవంతంగా నివారించుకునే శక్తీ ఉండాలి, ఇందుకోసం యోగ, ధ్యానం మరియు ప్రకృతితో మమేకమవ్వడం ఎంతో ఉపయోగపడతాయి. వీటితో పాటు మనం తినే ఆహారం కూడా ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఒత్తిడిని తగ్గించగల ఎన్నో పానీయాల గురించి పొందుపరిచారు వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి రసం:
శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించగల సామర్ధ్యం ఉసిరి రసానికి ఉంది. ఉసిరిని ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో ఉసిరికి సంబంధించిన ఎన్నో ఉపయోగాల గురించి పొందుపరిచారు. ఉసిరిలో విటమిన్-సి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ మరియు చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో సహాయపడతయి. ఉసిరి శరీరాన్ని స్థిరీకరించి, ప్రశాంతత కల్పిస్తుంది.
భృంగరాజ్ టీ :
కొన్ని దశాబ్దాల నుండి ఆయుర్వేదంలో భృంగరాజ్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఫాల్స్ డైసీ అని పలవబడే ఈ మొక్కను ఎన్నో ఏళ్లుగా జుట్టుకు పోషణను ఇచ్చేదిగా ఉపయోగిస్తున్నారు. ఈ భృంగరాజా ఆకులను టీ లో కలుపుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా భృంగరాజా మెదడుకు రక్తప్రసరణ పెంచుతుంది దీని వలన ఆక్సిజన్ సరఫరా జరిగి మెదడు రిలాక్స్ అవుతుంది. జుట్టు బలంగా మరియు ఒత్తుగా పెరిగేందుకు కూడా భృంగరాజ్ సహాయపడుతుంది.
మెంతి నీరు:
పోపుల డబ్బడలో ఎప్పుడు ఒక భాగమైన మెంతుల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు ఆహారపరంగా మరియు ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. వీటికి శరీరానికి మరియు జుట్టుకు పోషణను అందించే ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఒక చిన్న స్పూన్ మెంతి గింజలను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టి, పరగడుపున ఆ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒత్తిడి మూలంగా జుట్టు ఎక్కువుగా రాలేవారు ప్రతిరోజు మెంతి నీరు తాగడం వాళ్ళ జుట్టురాలడం ఆగుతుంది.
మందార పువ్వుల టీ:
తెలుగువారి ఇళ్లలో సాధారణంగా కనిపించే చెట్లలో మందార చెట్టు ఒకటి, ఆయుర్వేదం ప్రకారం మనది రేకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మందార పూవుల్లో విటమిన్లు మరియు అమైనో ఆమ్లాలు సంవృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడుకు అవసరమైన పోషణను అందించడంలో సహాయపడతయి. అంతేకాకుండా మందార పువ్వు రేకులను టీ లో కలుపుకొని తాగడం వలన, జుట్టు రాలడం, మరియు జుట్టు పెరగడంలో తోడ్పడుతుంది.
త్రిఫల కాషాయం:
ఒత్తిడి అధికంగా ఉంటె ఆ ప్రాభవం కడుపు మీద చూపుతుంది. దీనివలన ఆకలి మందగించడం, అరుగుదల తగ్గడం, మొదలైన సమస్యలు తలేతెందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వారు త్రిఫల కాషాయం తాగడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. త్రిఫల అనేది, తానికాయ, ఉసిరికాయ, కారకాయ వంటి మూడు పండ్ల కలయిక. ఇవి ఆకలిని ప్రోత్సహించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Share your comments