మనిషి బ్రతకాలంటే తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోకపోతే నీరసించి మన శరీరం శక్తిని కోల్పోయి అనేక వ్యాధుల బారిన పడతాను. అందుకోసమే మన శరీరానికి తగినంత పోషక విలువలతో కూడిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల
మన శరీరానికి తగినంత శక్తి అందడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతాము. అయితే చాలామంది ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. ఈ విధంగా తప్పులు చేయటం వల్ల ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఆహారం తినేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది బెండకాయలు కాకరకాయలు కలిపి ఆహారంగా తీసుకుంటారు. ఈ విధంగా తీసుకోవటంవల్ల శరీరంలో టాక్సిన్లు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే ఫుడ్ పాయిజన్ ఏర్పడుతోంది. అదేవిధంగా చాలామంది పెరుగులోకి ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు. ఇలా చేయటం వల్ల పొట్టలో రింగ్‌వార్మ్, గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.
మన ఆహారంలో భాగంగా పప్పు ధాన్యాలను తీసుకున్నట్లయితే ఆ వెంటనే పాలు తాగకూడదు. అలాగే ముల్లంగి ,గుడ్డు, మాంసం వంటి ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా పాలు తాగకూడదు.ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను ఒకే సారి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. చాలామంది ముల్లంగిని ఆహారంలో సలాడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఆహారంలో బెండకాయ తిన్నప్పుడు ముల్లంగి సలాడ్ తినడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ రెండింటినీ కలిపి తినడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక చాలామంది మిల్క్ షేక్ లో ఎక్కువగా పండ్లను కలుపుకుని తింటారు. ఈ విధంగా పండ్లు పాలు కలిపి తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విధంగా తినటం ద్వారా పాలలో ఉన్నటువంటి క్యాల్షియం పండ్లలో ఉన్న ఎంజైమ్లు గ్రహిస్తాయి. ఈ క్రమంలోనే ఈ పండ్లను తినటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కనుక పొరపాటున కూడా ఈ విధమైనటువంటి అలవాట్లను మానుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
Share your comments