వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనకి తెలుసు అయితే జుట్టు ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి ఎంతో ప్రయోజకరిగా ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలిపోవడం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు ఎక్కువుగా రాలిపోవడంతో చిన్నవయసులోనే బట్టతలా రావడం లేదా జుట్టు పలచగా మారిపోవడం వంటివి జరుగుతున్నాయి. జుట్టు రాలడానికి అనుగుణంగా జుట్టు పెరుగుదల లేకపోతే దీనిని నివారించడానికి తగిన జాగ్రత్తలు పాటించాలి.
జుట్టు రాలడాన్ని తగ్గించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని వాడటం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. జుట్టు రాలడానికి చుండ్రు ప్రధానకారణం. తలామీద పెరిగే ఒకరకమైన బాక్టీరియా ఈ చుండ్రుకు ప్రధాన కారణం. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది, దీనికి యాంటిబ్యాక్ట్రయల్ లక్షణాలు ఉంటాయి, ఇవి స్కాల్ప్ మీద బాక్టీరియా ను తొలగించి, చుండ్రు సమస్య తగ్గేలా చేస్తాయి. దీనితో జుట్టు రాలే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అల్లిసిన్ లోని మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది హెయిర్ ఫాలికల్స్ ను ప్రేరేపించి, తిరిగి మళ్ళి కొత్త జుట్టు మొలిచేలా చేస్తుంది.
ప్రభావంతంగా పనిచేస్తుందని వెల్లుల్లిని నేరుగా జుట్టు మీద రుద్దితే జుట్టు నుండి వెల్లుల్లి వాసన వస్తుంది. అంతేకాకుండా చికాకు, మంట, మరియు దురదా కూడా కలుగుతుంది. కాబట్టి వెల్లుల్లిని నేరుగా జుట్టు మీద రుద్దకూడదు. ఇందుకోసం ముందుగా ఒక వెల్లుల్లిని నూరి ఒక గాజు సీసాలో వెయ్యాలి, దానిలో 50 మిల్లీలీటర్ల నీటిని వెయ్యాలి. ఈ బాటిల్ ను ఎండలో లేదా వెచ్చని ప్రదేశంలో రెండు రోజులపాటు ఉంచాలి. తరువాత ఈ ద్రవాన్ని స్పేర్ బాటిల్ లో వేసి దానిని, తలస్నానం చెయ్యడానికి రెండు-మూడు గంటల ముందు జుట్టుకు పట్టించి తలా స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నుండి వెల్లుల్లి వాసన రాకూడదనుకునేవారు వెల్లుల్లి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
Share your comments