Health & Lifestyle

ఈ చిన్న పొరపాటుతో 80 వేల రేషన్‌కార్డులు రద్దు.. ఈ పొరపాట్లు మీరు చేయకండి !

Srikanth B
Srikanth B

ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్రం రేషన్ కార్డు లబ్ది దారుల పై వేటు వేయడానికి సిద్దమయింది , రేషన్‌ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది . అర్హత లేకున్నా ఉచితంగా రేషన్ పొందుతున్న వారిని గుర్తించి వారి కార్డులను రద్దు చేయాలనీ చూస్తుంది ఇప్పటికే ఈమేరకు కార్యాచరణ రూపొందించింది కాబట్టి ఈ పొరపాట్లు మీరు చేయకండి లేదంటే మీరుకూడా రేషన్ కార్డు కోల్పోయే ప్రమాదం వుంది .

కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు ప్రారంభించాయి . రేషన్‌కార్డుదారుల పొరపాటు వల్ల 80 వేల కార్డులు రద్దయ్యాయి. వాస్తవానికి కార్డుదారులు ఆరు నెలల పాటు నిరంతరం రేషన్ తీసుకోకపోతే అతని పేరును ప్రభుత్వం జాబితా నుండి తొలగిస్తుంది. దాని స్థానంలో మరో నిరుపేద వ్యక్తికి రేషన్‌కార్డు తయారు జారీ చేస్తారు. కాబట్టి మీరుకూడా ఈ తప్పులు చేస్తుంటే వెంటనే ప్రతి నెల రేషన్ తీసుకోవడం ప్రారంభించండి లేదంటే మీరు రేషన్ కార్డు కోల్పోయే ప్రమాదం వుంది .

ఇప్పటికే గోవా ప్రభుత్వం ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 80 వేల మంది రేషన్ కార్డుదారులను రద్దు చేసింది . రేషన్ కార్డు హోల్డర్లు ఆగస్టు 2022 నుండి జనవరి 2023 వరకు తమ రేషన్ తీసుకోలేదు దీనితో వారిని అర్హుల జాబితా నుంచి తొలగించి వేరే పేద లకు అందించనుంది .

రేషన్ తీసుకోని కార్డుదారుల కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల డైరెక్టర్ గోపాల్ పర్సేకర్ తెలిపారు. దీనితో పాటు ఇంత పెద్ద సంఖ్యలో కార్డుదారులు రేషన్ ఎందుకు తీసుకోలేదో కూడా డిపార్ట్‌మెంట్ విచారణ చేస్తోందని చెప్పారు.

భారత్‌కు చేరుకున్న మరో 12 చీతాలు, కునో నేషనల్ పార్క్‌కు తరలింపు..

రాష్ట్రంలో 13.32 లక్షల మంది రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో 80 వేల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ తీసుకోకపోవడం వల్ల వారి రేషన్ కార్డును రద్దు చేసింది , ఈ ప్రక్రియను అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలనీ భావిస్తుంది కావున ఎవరైనా ఇప్పటికి రేషన్ తీసుకోకపోతే వెంటనే ప్రతి నెల తీసుకోవడం ప్రారంభించండి .

భారత్‌కు చేరుకున్న మరో 12 చీతాలు, కునో నేషనల్ పార్క్‌కు తరలింపు..

Related Topics

NEW RATION CARDS

Share your comments

Subscribe Magazine