Adding Fruits In Breakfast: మనలో చాలా మంది ఉదయాన్నే పండ్లను తినే అలవాటు ఉంది. అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే ఆపేయండి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది . అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం .
Adding Fruits In Breakfast: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే! అవి మనల్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. అయితే మీరు ఉదయాన్నే తినే అల్పాహారంలో కొన్ని పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడానికి బదులుగా హానిని కలిగిస్తాయి. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.
ఉదయాన్నే పండ్లు తినకూడదని చెప్పడానికి ప్రధాన కారణం..
ఉదయం వాతావరణం చల్లగా, తేమగా ఉంటుంది. అదే సమయంలో పండ్లు కూడా చల్లగా, తేమగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు పండ్లను తీసుకుంటే.. ఇది మీ శరీరంలో వుండే జీర్ణ సంబంధిత ఆమ్లాలను అసమతుల్యతకు గురిచేస్తాయి . దీని కారణంగా ఆహారం సరిగా జీర్ణం అవదు కాబట్టి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత అధికంగా ఆహారాన్ని తీసుకోకపోవడం మేలు.
నిద్ర లేమి వల్ల ఒత్తిడి... ఆత్మహత్య ఆలోచనలు!
పండ్లు తీసుకోవడానికి సరైన సమయం:
పండ్లను తినడానికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సరైన సమయమని వైద్య నిపుణులు సూచిస్తారు . మధ్యాహ్నం భోజనం తర్వాత పండ్లు తినడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీకు జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు .
ఇదికూడ చదవండి .
Share your comments