ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది తాజాగా జికా వైరస్ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ భయంకరమైన పరిస్థితులలో కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసు బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అసలు జికా వైరస్ అంటే ఏమిటి? ఈ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ లక్షణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం....
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో వైరస్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జికావైరస్ కేరళ రాష్ట్రంలోని 24 సంవత్సరాల గర్భిణీ స్త్రీలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ జికా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది ఏమీ కాదని, తెలియజేశారు. అసలు జికా వైరస్ సాధారణ డెంగ్యూ, మలేరియా, మాదిరిగానే జికా వైరస్ కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందనీ అధికారులు తెలిపారు.
జికా వైరస్ ప్రధానంగా ఈడెస్ దోమల ద్వారా వస్తుంది. ఈ జికా వైరస్‌కు పగటిపూట కుట్టే దొమల వల్ల వ్యాప్తి చెందుతుంది. దోమ కుట్టినప్పుడు చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణం అవుతుంది ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు వ్యాధిని కనుగొనడం కొంచెం కష్టతరమవుతుంది.ఈ వ్యాధి లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలు కలిగి ఉండటం వల్ల అందరూ సాధారణ ఫ్లూ అని భావిస్తారు.
జికా వైరస్ సోకినప్పుడు మనలో కనిపించే మొదటి లక్షణం జ్వరం. తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు ఏర్పడడం వంటి లక్షణాలు కనబడతాయి. అయితే ఈ లక్షణాలు ఒక వారంలోగా నయం కాకపోతే వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలి. మరికొందరిలో ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు కళ్ళలో నీళ్లు కారడం, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు కూడా వస్తాయి.వైరస్ మన శరీరంలో వ్యాప్తి చెంది మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్లలో కి కూడా కారణమవుతుంది కనుక వీలైనంత వరకు ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
Share your comments