Health & Lifestyle

కొలెస్ట్రాల్ తగ్గించుకోవడనికి 6 చక్కని ఆహారపదార్ధాలు ఇవే....

KJ Staff
KJ Staff

ప్రస్తుత రోజుల్లో, ఆహారపు అలవాట్లలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని వలన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూనెతో చేసిన వంటకాలు ఎక్కువగా తినడం మూలాన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. ప్రపంచంలో ఇప్పటికే వేలాది మంది జనం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం మూలాన అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది.

సాధారణంగా శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం, కణాలు అభివృద్ధి చెందడానికి కొలెస్ట్రాల్ సహాయపడుతుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువుగా ఉంటేనే ప్రమాదకరం. లో-డెన్సిటీ-లిపోప్రొటీన్ దీనినే చెడు కొలెస్ట్రాల్ లాగా పరిగణిస్తారు. ఇది రక్తనాళాల్లో చేరి, రక్త ప్రశరణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివలన బ్లడ్ ప్రెషర్ పెరిగి గుండె మీద అధిక భారం పడుతుంది. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని నివారించడానికి కొన్ని రకాల ఆహారం తీసుకోవడం మంచిది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్:

ఈ మధ్యకాలంలో ఓట్స్ వినియోగం ఎక్కువవుతుంది, ఓట్స్ లోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్న ప్రజలు వీటిని తినడానికి మొగ్గుచూపుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ నివారించడానికి కూడా ఓట్స్ సహాయపడతాయి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఈ ఫైబర్ మన జీర్ణాశయంలో చెడు కొలెస్ట్రాల్ ని పట్టి ఉంచి రక్తంలో కలవనియ్యకుండ చేస్తుంది. ఓట్స్ ని తినడానికి అనేక మార్గాలున్నాయి, వీటిని స్మూతీస్ ఇంకా బ్రెడ్ లోను కలిపి తినవచ్చు. మీ రోజును ఒక కప్పు ఓట్స్ తో ప్రారంభిస్తే రోజంతా ఎనర్జిటిక్గా ఉంటారు.

చేపలు:

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవాలి అనుకునేవారికి చేపలు ఒక వరం. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ శారీరంలో ట్రైగ్లిస్రాయిడ్స్ని నిర్ములించి వాపును తగ్గిస్తాయి. చేపలను తినడం ద్వారా లభించే హై-డెన్సిటీ-లిపోప్రోటీన్ వీటిని మంచి కొలెస్ట్రాల్ లాగా పిలుస్తారు, ఇవి చెడ్డ కొలెస్ట్రాల్ మొత్తాన్ని శరీరం నుండి బయటకి పంపడంలో సహాయపడుతుంది. చేపలు తినేవారు వీటిని గ్రిల్ చేసుకొని, ఉడకబెట్టి, లేదంటే సలాడ్స్ లాగా తినడం చాల మంచిది.

డ్రైఫ్రూప్ట్స్:

బాదాం, పిస్తా, వాల్నుట్స్ వీటన్నిటిలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు ఫైబర్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని నిర్ములించడంలో తోడ్పడతాయి. వీటిని త్రాచు సాక్స్ లాగా లేదంటే ఆహారంలో టాపింగ్స్ లాగా చేర్చుకుని తినడం అలవాటు చేసుకోండి

అవకాడోస్:

అవకాడోస్ మన దేశానికి చెందినవి కావు, కానీ ఈ మధ్య మన దేశ మార్కెట్లలో కూడా వీటి లభ్యత పెరిగింది. అవకాడోస్ లో డ్రైఫ్రూప్ట్స్ లాగానే మోనో ఆన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువుగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఎక్కువ కొలెస్ట్రాల్ రక్తంలో కలవకుండా చేసే కొన్ని ప్రయోజనాలు కూడా వీటిలో ఉన్నాయి. వీటిని శాండ్విచ్, సలాడ్స్ లో తినడానికి అనువుగా ఉంటాయి.


తృణధాన్యాలు:

తృణధాన్యాలు మొక్కల ఆధారిత ప్రోటీన్ కు మరియు ఇతర పోషకాలకు మూలం, వీటిని తరచు తినడం ద్వారా అధిక ఫైబర్ లభించి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కలవకుండా కాపాడగలవు. బీన్స్, కందులు, సెనగలు వంటి వాటిని ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవడం మంచిది.

ఆలివ్ ఆయిల్

మనం తరచూ వాడే నూనెకు బదులు ఆలివ్ ఆయిల్ తో ఆహారం వండుకోవడం మంచిది. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నూనెలో మోనో అన్సాతురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండటం మూలాన చెడు కొలెస్ట్రాల్ ని ధరిచేరనియ్యదు. కాకపోతే ఆలివ్ ధర మాములు నూనెకంటే కాస్త ఎక్కువగా ఉంటుంది, ఈ నూనెతో ఆహారం చేసుకుని తినలేని వారు సలాడ్స్ మరియు మారినేషన్ లో ఈ నూనెను ఉపయోగిస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine