Health & Lifestyle

జూలై నెలలో కొత్తగా 53 లక్షల ఆధార్ కార్డు లు జారీ ..

Srikanth B
Srikanth B

దేశంలో ఆధార్ నమోదు, వినియోగం మరియు ఆమోద కార్యకలాపాలు వేగంగా సాగుతున్నాయి. 2022 జూలై చివరి నాటికి దేశ ప్రజలకు 134.11 కోట్లకు పైగా ఆధార్ కార్డులు జారీ అయ్యాయి.

జూలై నెలలో 1.47 కోట్ల మంది ఆధార్ మార్పుల కోసం దరఖాస్తు చేశారు. వీటిలో ప్రజల నుంచి అందిన వినతుల మేరకు 63.55 కోట్ల ఆధార్ కార్డులలో మార్పులు చేర్పులు చేసి నవీనీకరించడం జరిగింది. భౌగోళిక, బయో మెట్రిక్ మార్పుల కోసం ప్రజల నుంచి ఆధార్ కేంద్రాల నుంచి బౌతికంగా మరియు ఆన్‌లైన్ పద్దతిలో ధరఖాస్తులు అందాయి.

జూలై నెలలో ఆధార్ ద్వారా 152.5 కోట్ల అధీకృత కార్యకలాపాలు జరిగాయి. వీటిలో ఎక్కువ శాతం ( 122.57 కోట్లు) వేలిముద్రల బయోమెట్రిక్ ప్రామాణీకరణ కార్యకలాపాలు జరిగాయి. భౌగోళిక అధీకృత కార్యకలాపాలు రెండో స్థానంలో నిలిచాయి.

2022 జూలై చివరి నాటికి ఆధార్ వినియోగించి మొత్తం 7885.24 కార్యకలాపాలు జరిగాయి. జూన్ చివరి నాటికి ఈ సంఖ్య 7702.74 కోట్లుగా ఉంది.

జూలై నెలలో కొత్తగా 53 లక్షల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం కార్డులను 18 సంవత్సరాల లోపు[ వయస్సు (0 నుంచి 18 మధ్య వయస్సు ఉన్నవారు) వయస్సు ఉన్నవారికి జారీ చేయడం జరిగింది. దేశంలో వయో జనులందరూ దాదాపు ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. దేశంలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వయోజనుల శాతం 93.42 వరకు ఉంది. 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 90% మంది వయోజనులు ఆధార్ కార్డు కలిగి ఉన్నారు.

MSP మరియు ధరల స్థిరీకరణ నిధి కింద నిల్వ చేసిన పప్పుల వినియోగానికి క్యాబినెట్ ఆమోదం!

వంట గ్యాస్ సబ్సిడీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద అందుతున్న ప్రయోజనాలను ప్రత్యక్ష విధానంలో బదిలీ అయ్యే అంశంలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జి (APB) కీలక పాత్ర పోషిస్తోంది. జూలై నెలలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జి ద్వారా మొత్తం 12511 కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు జరిగాయి.

MSP మరియు ధరల స్థిరీకరణ నిధి కింద నిల్వ చేసిన పప్పుల వినియోగానికి క్యాబినెట్ ఆమోదం!

Share your comments

Subscribe Magazine