ప్రధాన మంత్రి ఎంప్లోయమెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ద్వారా సొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒక్కొక్కరికి 25 లక్షల వరకు రుణాలను అందిస్తుంది సర్కార్. ఈ పథకానికి సంబందించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.
PMEGP పథకానికి ద్వారా చిన్న, సూక్ష్మ కుటీర పరిశ్రమల నుంచి మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఈ రుణం అందిస్తారు.
వారి వయసు , 18 ఏళ్లు నిండి ఉండాలి. విద్యార్హత కనీసం 8వ తరగతి ఉంటే చాలు.
ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే అర్హులు.
ఎంత రుణమిస్తారు?
మీ ప్రాజెక్టు బట్టి 10 లక్షల నుండి 25 లక్షలు వరకు రుణాలను పొందే అవకాశం ఉంది.
జనరల్ కేటగిరి వ్యక్తులు తాము ప్రారంభించే పరిశ్రమ మొత్తం వ్యయంలో 10శాతం పెట్టుబడి భరించాలి. మిగిలిన 90 శాతాన్ని రుణంగా పొందవచ్చు.
2 ఇక మహిళలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులు 5 శాతం పెట్టుబడిగా పెట్టుకుంటే మిగిలిన 95శాతాన్ని రుణంగా ప్రభుత్వం అందిస్తుంది..
రుణంలో సబ్సిడీ లభిస్తుందా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, వికలాంగులు పెట్టే పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% సబ్సిడీ లభిస్తుంది. జనరల్ కేటగిరీకి 25%, 15% సబ్సిడీ కల్పిస్తారు. అయితే మీరు రుణం తీసుకున్న తర్వాత మూడేళ్లు వాయిదాలు సక్రమంగా చెల్లించిన తర్వాత మాత్రమే దీన్ని అమలు చేస్తారు.
వడ్డీ ఎంత ఉంటుంది?
అయితే ఈ రుణాలకు బ్యాంకును బట్టి వడ్డీ ఉంటుంది. సాధారణంగా 7-10% వడ్డీ ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ఇంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకానికి దరఖాస్తు చేసుకోవడం మొదలు, ఎంపిక ప్రక్రియ వరకు మొత్తం ఆన్లైన్లోనే సాగుతుంది.
ఆ అధికారిక వెబ్సైట్ kviconline.gov.inలో మీరు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోగానే రుణం ఇస్తారా? మీరు దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నెల పాటు శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఉండవచ్చు. అయితే ఈ శిక్షణ తప్పనిసరి.
దరఖాస్తుకు కావాల్సినవి
పాస్పోర్ట్ సైజు ఫొటో ప్రారంభించే పరిశ్రమకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తి వివరాలు.
అడ్రస్ ప్రూఫ్
హై కులం సర్టిఫికేట్
ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శిక్షణకు సంబంధించిన సర్టిఫికేట్
మీ దరఖాస్తుకు సంబంధించిన స్థితిగతులను అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చూడవచ్చు.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
చిన్న, సూక్ష్మ కుటీర పరిశ్రమల నుంచి మధ్యతరహా పరిశ్రమలు
ఏర్పాటు చేయాలనుకునే వారికి ఈ రుణం అందిస్తారు.
ఎవరు అనర్హులు?
* నెగెటివ్ పరిశ్రమల జాబితాలో ఉన్న వాటికి ఈ పథకం వర్తించదు.
? ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిశ్రమల విస్తరణతో పాటు వాటి నవీకరణకు రుణం పొందలేరు.
నెగెటివ్ పరిశ్రమలేంటి?
1. సిగరెట్, బీడీ, పాన్, మద్యం విక్రయించే లేదా సరఫరా చేసే హోటళ్లు, దాబాలకు, కల్లుగీత, మాంసానికి సంబంధించిన పరిశ్రమలు.
2. పంట ఉత్పత్తుల సాగు పరిశ్రమలు.. ఉదాహరణకు తేయాకు, కాఫీ, రబ్బరు, సెరీ కల్చర్, హార్టీ కల్చర్, యానిమల్ హస్బెండరీ, పిగ్గరీ, పౌల్ట్రీ, హార్వెస్టర్స్ తదితరాలు.
3. 20 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన పాలిథీన్ కవర్ల తయారీ పరిశ్రమలకు ఈ పథకం వర్తించదు.
Share your comments