సాధారణంగా ఎంతో మంది రైతులు, వ్యవసాయ అవసరాల నిమ్మిత్తం డబ్బును అరువుగా తీసుకుంటారు. ఈ అప్పు బ్యాంకుల నుండి రుణాల రూపంలో, ఇంకా పల్లెటూరులో షావుకారుల దగ్గర నుండి పొందుతారు. కొన్ని సమయాల్లో సరైన సమయానికి డబ్బు దొరక్క రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి, అటువంటి సమయంలో అధిక వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ యాతనను తాగించి సకాలంలో పెట్టుబడి రుణాలు పొందేందుకు, 1998 లో మొట్టమొదటి సారి ఈ స్కీం ను ప్రారంభించారు. అయితే సరైన అవగహన లేక, ఈ స్కీం ఇప్పటికి అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఈ స్కీం కు గురించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రైతుల రుణ అవసరాలను వీలైనంత తొందరగా తీర్చేందుకు 1998 లో కిసాన్ క్రెడిట్ స్కీం ప్రవేశపెట్టారు, తరువాత 2004 లో కొన్ని సవరణలు చేసి, రైతుల పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా మార్చారు. దేశంలోని వివిధ బ్యాంకులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పొందే వెసులుబాటు కలిపించాయి. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకు సమస్థలన్నిటికి కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా మార్గదర్శకాలు సూచించారు. అంతేకాకుండా అన్ని బ్యాంకింగ్ సంస్థలు ఈ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు. మరొక్క ప్రత్యేకత దేమిటంటే దీని ద్వారా వచ్చే వడ్ఢికుడా చాల తక్కువ, ఏడాదికి కేవలం 4% మాత్రమే వడ్డీరేటు. కనుక రైతులు తము తీసుకున్న వడ్డీని సులభంగా తీర్చగలరు.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా సాధారణ క్రెడిటే కార్డు లాగానే మాగ్నెటిక్ స్ట్రిప్ మరియు ప్రత్యేక పిన్ నెంబర్ తో పొందవచ్చు. ఈ కార్డును ఉపయోగించి నెట్ బ్యాంకింగ్ సేవలు, కార్డు పేమెంట్ సేవలు మరియు ఎటిఎం నుండి నగదు విత్డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. మీ యొక్క పంట అవసరాలను బట్టి, మరియు పొలం పరిమాణాన్ని బట్టి ఋణం లభిస్తుంది, సాధారణంగా 10,000-50,000 రూ వరకు నగదు పొందేందుకు వెసులుబాటు ఉంది. కుటుంబ మరియు వ్యవసాయ అవసరాలు, కొత్త పనిముట్లు ఖరీదు చెయ్యడానికి, మరియు వ్యవసాయ ఉత్పత్తులను వేర్ హౌస్ లో భద్రపరుచుకోవడం ఇలా వివిధ అవసరాలకు రైతులు లోన్ పొందవచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డు పొందేందుకు రైతులు తమ దగ్గర్లోని బ్యాంకును నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు అంతే కాకుండా ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ తో పాటు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, మీ ఆధార కార్డు లేదా పాస్పోర్ట్, పొలం దృవీకరణ పత్రాలు, క్రెడిట్ కార్డు అప్లికేషన్ కోసం అవసరం. లోన్ అమౌంట్ మూడు లక్షలకు పైగా పొందాలి అనుకునే రైతులు సెక్యూరిటీ డాక్యూమెంట్లు కూడా ఇవ్వాలి. అప్లికేషన్ లో మొత్తం సర్రిగ్గా ఉంటే 3-4 రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు మీకు లభిస్తుంది.
Share your comments