ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలై, ఇప్పటికి కూడా విజయ పరంపరలో కొనసాగుతున్న ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, రికార్డు స్థాయిలో మరిన్ని ఎక్కువ దరఖాస్తులను రైతులనుండి అందుకుంది.
మానవ ప్రమేయం లేకుండా జరిగే ప్రకృతి వైపరీత్యాల నుండి, రైతులు ఆర్ధికంగా నష్టపోకుండా ఉండేందుకు, 2016 లో కేంద్రం, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన(PMFBY) పధకాన్ని ప్రెవేశ పెట్టింది. ఈ పధకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు, ప్రకృతి ద్వారా సంభవించిన నష్టాలకు ఇన్సూరెన్సు పొందవచ్చు. ఈ పధకం ద్వారా రైతులు, నిశ్చింతగా తమ వ్యవసాయ కార్యకలాపాలపై ద్రుష్టి సారించ్చవచ్చు. ఈ స్కీం యొక్క అనేక ప్రయోజనాల మూలంగా ప్రారంభించిన నాటి నుండి ఎంతో మంది రైతులు ఈ స్కీం కు దరఖాస్తు చేసుకుని దీనిలో భాగస్వాములయ్యారు. ఇప్పటివరకు సుమారు 56.80 కోట్ల మంది రైతులు ఈ స్కీం కు నమోదు చేసుకున్నారు. అంతే కాకుండా, 23.22 కోట్ల పోలసీదారులు, తమ పంటకు నష్టాన్ని భీమా రూపంలో లాభంగా మార్చుకున్నారు. రైతులు తాము చెల్లించిన ప్రీమియంకి ఐదు ఇంతలు వెన్నకి భీమా రూపంలో పొందడం విశేషం.
ప్రారంభం నాటినుండి, ఎంతో గుర్తింపు పొందిన ఈ పథకానికి, దరఖాస్తు చేసుకునే రైతుల సంఖ్య నానాటికి పెరుగుతునే వస్తుంది, 2021-23 వరకు 41% ఉన్న ఈ సంఖ్య ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి 27% గా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ స్కీం నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ స్కీం అమలుచేస్తున్న అన్ని రాష్ట్రాల్లో, ఏకరూపతను పెంచడం, నిరంతర పర్యవేక్షణ, మరియు సాంకేతికతను జోడించడం ద్వారా ఈ స్కీం ను మరింత బలపరుస్తున్న. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇన్సూరెన్సు స్కీం గా గుర్తింపు పొందింది, దినికి ముఖ్య కారణాలుగా పారదర్శకత మరియు జవాబుదారితనం పాటించడం. రైతులకు సకాలంలో భీమాని అందిస్తూ, వారి వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి యొక్క నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచుతోంది.
Share your comments