తపాలా కార్యాలయం కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రకాల స్కీంలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం వలన ప్రజలకు నష్టం కలుగదు, ఎందుకనగా ఈ పథకాలు అన్ని కేంద్ర ప్రభత్వం పర్యవేక్షణలో జరుగుతాయి. కాబట్టి ప్రజలు ధైర్యంగా వీటిలో పెట్టుబడులు పెట్టచ్చు. గ్రామీణ ప్రజలకు సేవింగ్స్ కొరకు ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు అనేవి చాలా ఉత్తమం.
మీరు రిస్క్ లేకుండా మంచి రాబలి పొందాలి అనుకుంటే గనుక అందుబాటులో అదిరిపోయే స్కీమ్ ఉంది. పోస్టాఫీస్ అందించే వివిధ రకాల పథకాల్లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడంతో మీరు మంచి లాభాన్ని పొందవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని కూడా పొందవచ్చు. ఈ పథకం గురించి మరింత తెలుసుకుందాం.
ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై 6.5 శాతం వడ్డీ రేటు పొందుతారు. ఈ పథకంలో మీరు రూ.100 నుంచి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. గరిస్ట పరిమిత అంటూ ఏమీ లేదు. మీరు ఈ పథకానికి సింగల్ లేదా జాయింట్ అకౌంట్ తెరుచుకోవచ్చు. మీరు ఈ పథకం కింద ప్రతి నెలా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ 5 సంవత్సరాలు. తర్వాత మీ డబ్బులను ఒకేసారి చెల్లిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడి పొందొచ్చు.
ఇది కూడా చదవండి..
బంగాళాఖాతంలో అల్పపీడనం ... నేడు ,రేపు తెలంగాణలో భారీ వర్షాలు..
ఉదాహరణకు, మీరు రూ.1000 నెలవారీ చెల్లింపును ఎంచుకుంటే, మెచ్యూరిటీ తర్వాత మీకు జమ అయ్యే మొత్తం ఎంతో తెలుసుకుందాం. ఐదు సంవత్సరాల వ్యవధిలో, మీ మొత్తం డిపాజిట్ చేసేది రూ. 60,000. మీకు వడ్డీ రూపంలో రూ. 11000 వస్తాయి. మీరు మీ టెన్యూర్ మరొక 5 సంవత్సరాలు పొడిగించినట్లైతే, మీ డిపాజిట్ మొత్తం రూ. 1.2 లక్షలకు చేరుతుంది. దానికి వడ్డీతో కలిపి మొత్తం 1.69 లక్షలు వస్తాయి.
అలాగే మీరు మరో ఐదేళ్లు టెన్యూర్ పొడిగించుకుంటే.. అప్పుడు మీరు రూ. 2.4 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. మీకు వడ్డీ రూపంలో రూ. 2.5 లక్షలు వస్తాయి. అంటే మీకు 20 ఏళ్లలో దాదాపు రూ.5 లక్షలు వస్తాయి. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది. టెన్యూర్ ఆధారంగా కూడా రిటర్న్‌లో మార్పు ఉంటుంది.
ఇది కూడా చదవండి..
Share your comments