సోల సిస్టం ద్వారా, రైతులందరికీ తమ వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ అందించాలని, కేంద్ర ప్రభుత్వం 2019 లో ఈ పీఎం కుసుమ్ స్కీం మొదలుపెట్టింది. ప్రతి రైతుకు సోలార్ పంప్ సౌలభ్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం ఈ స్కీం ను రూపొందించింది. అయితే ఈ పధకం మీద సరైన అవగాహనా లేనందువల్ల ఇప్పటికి ఈ స్కీం ప్రారంభ దశలోనే ఉంది.
వ్యవసాయానికి నీరు ప్రాణాధారం, నీరు లేకుంటే వ్యవసాయం లేదు. అయితే మన దేశంలో ఇప్పటికి చాల మంది రైతులు సరైన నీటి వసతులు లేక వర్ష ధారమైన పంటలు పండిస్తున్నారు. దేశంలోని రైతులందరికీ సోలార్ పంప్ సౌలభ్యాన్ని కల్పించడం ద్వారా, వారి వ్యవసాయ ఉత్పాదతాకను పెంచి, ఆదాయం పెంచాలన్న లక్ష్యంతో ఈ స్కీం ముందుకు పనిచేస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్ ) స్కీం కూడా పీఎం సూర్యఘర్ ముప్ట్ బిజిలి యోజన మాదిరిగానే, రైతులు తమ పొలంలో సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ కోసం దేశంలోని విక్రేతలతో, నేరుగా కనెక్ట్ కావచ్చు. దీని కోసం నేషనల్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ స్కీం లో మరొక్క ప్రత్యేకత ఏమిటంటే, రైతులు తమకు నచ్చిన సోలార్ పంప్ రకాన్ని ఎంచుకునే అవకాశం ఉంది, మరియు పంప్ ఇన్స్టాలేషన్ సమయం కూడా ఆదా అవుతుంది. ఈ స్కీం కోసం కేంద్రం రూ. 34,422 కోట్లు ఖర్చుచేస్తుంది. సోలార్ పంప్ ఇన్స్టలేషన్ ద్వారా రైతుల మీద భారం పడకుండా ఉండేందుకు కేంద్రం 30% సబ్సిడీ ఇస్తుంది, మరియు రాష్ట్రాలు 30% ఇస్తాయి మిగిలిన మొత్తం బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి రుణాల రూపంలో పొందవచ్చు
డబల్ ఆదాయం:
సోలార్ పుంపులను ఏర్పాటు చేసుకున్న రైతులు తాము వాడుకోగా మిగిలిన విద్యుత్తును డిస్కోమ్ కు విక్రయించుకుని అదనపు ఆద్యం పొందవచ్చు. దీని కోసం రైతులు డిస్కోమ్ లతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ ఒప్పందాన్ని బట్టి రైతులు 25 ఏళ్ల పాటు విద్యుత్తును విక్రయించవచ్చు. అయితే సరైన అవగాహన లేకపోవడం మూలాన ఈ స్కీంకు తగ్గ ప్రాచుర్యం లభించలేదు. రానున్న రోజుల్లో ఈ స్కీం ను మరింత ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తీసుకువెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
Share your comments