Government Schemes

రైతులకు గమనిక: పీఎం కిసాన్ అర్హుల జాబితా వచ్చేసింది.. 6 వేలు మీకు వస్తాయో.? లేదో.? ఇలా చూసుకోండి

KJ Staff
KJ Staff
PM KISAN
PM KISAN

పీఎం కిసాన్ అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఎప్పటికప్పుడు అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. ఈ జాబితాలో కొత్తగా లబ్ధిదారులైన రైతుల పేర్లతో పాటు పాత లబ్ధిదారుల పేర్లను కూడా కేంద్ర ప్రభుత్వం పొందుపరుస్తుంది. అలాగే కొన్ని కారణాల వల్ల అనర్హత గలిగిన లబ్ధిదారుల పేర్లను కేంద్రం తొలగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ పథకం నుంచి రూ.33 లక్షల రైతుల పేర్లను కేంద్రం తొలగించింది. అర్హత లేకపోయినా పీఎం కిసాన్ డబ్బును పొందుతున్నారనే కారణంతో వీరిని తొలగించినట్లు తెలుస్తోంది. అధికారులు చేసిన తనిఖీల్లో వీరికి అర్హత లేకపోయినా నగదును పొందుతున్నట్లు వెల్లడైంది.

లబ్ధిదారుల పాన్, ఆధార్ కార్డులను అధికారులు తనిఖీ చేసిన అనంతరం అనర్హత పొందిన వారి పేర్లను కేంద్రం తొలగించింది. కొంతమంది లబ్ధిదారులు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. అలాగే మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షన్ ప్రయోజనాలు పొందుతున్నట్లు వెల్లడైంది.

 ఇంతకు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో.. లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది విధంగా చేయండి

-https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి

-వెబ్‌సైట్‌లోని Beneficiaries List అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

-ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్, బ్లాక్, గ్రామం పేర్లు ఎంచుకుని గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి.

-ఆ తర్వాత మీ గ్రామానికి చెందిన లబ్ధిదారుల జాబితా వస్తుంది. -అందులో మీ పేర్లు ఉందో.. లేదో చూసుకోండి. ఒకవేళ మీకు అర్హత ఉన్నా.. మీ పేరు తొలగిస్తే.. సంబంధిత అధికారులను సంప్రదించండి.

Share your comments

Subscribe Magazine