Government Schemes

PM కన్యా ఆశీర్వాద్ స్కీమ్‌ ఆడ పిల్లలకు 1. 8 లక్షలు అందించే స్కీం ఉందా ?

Srikanth B
Srikanth B

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల శ్రేయషు దృష్ట్యా అనేక రకాల పథకాలను ప్రవేశ పెడుతూ ఉంటుంది , అయితే అందులో కొన్ని షరతులకు లోబడి ఉంటే మరికొన్ని పథకాలు లేకున్నా కొందరు పథకాల పేరుతో దోపిడీ చేస్తుంటారు , అలంటి వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న PIB ప్రెస్ ఇన్ఫార్మషన్ బ్యూరో వాస్తవాలను బయటికి తెస్తుంది , అలంటి కథనమే మీరు ఇప్పుడు చదివేది అసలు ఎం జరిగిందంటే ?

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కన్యా ఆశీర్వార్ యోజన పేరుతో ఒక పథకాన్ని అందిస్తోందని ఒక యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పీఎం కన్యా ఆశీర్వాద్ స్కీమ్ కింద ఆడ పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 1.8 లక్షల వరకు అందిస్తోందని యూట్యూబ్ ఛానల్ పేర్కొంది. ఈ డబ్బులు అమ్మాయిల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలోని నేరుగా వచ్చి చేరతాయని సదురు యూట్యూబ్ ఛానల్ కధనం పేర్కొంది

.అయితే అసలు ఈ స్కీమ్ అమలులో లేదు. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని తీసుకురాలేదు.అయినా కూడా ఆ స్కీమ్ ఉందని యూట్యూబ్ ఛానల్ కథనం ప్రచురించడంతో అప్రమతమైన PIB ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది అందులో అసలు ఇలాంటి స్కీం ఒకటి అసలు లేదని పేర్కొంది ఇలాంటి మోసపూరిత స్కీమ్స్‌తో ప్రజలు మోసపోవాల్సి రావొచ్చు.

కలవర పెడుతున్నహెచ్3ఎన్2 కొత్త వైరస్ లక్షణాలు ఇవే !

రిజిస్ట్రేషన్ అంటూ మీ వ్యక్తి గత వివరాలను, బ్యాంకింగ్ వివరాలను సేకరించి డబ్బులను కాజేసే అవకాశం వుంది కావున ఎవరైనా మిమ్మలిని స్కిం పేరుతో డబ్బులు ఇప్పిస్తామంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి .

అందువల్ల ఎవరైనా ఇలాంటి స్కీమ్ గురించి విని ఉంటే.. అది పూర్తిగా ఆబద్దమని గుర్తించండి .లేదంటే మాత్రం మొదిటికే మోసం వస్తుంది.

కలవర పెడుతున్నహెచ్3ఎన్2 కొత్త వైరస్ లక్షణాలు ఇవే !

Related Topics

check pm kisan status

Share your comments

Subscribe Magazine