ప్రస్తుత ఆధునిక కాలంలో వ్యవసాయ చేసేవారి సంఖ్య తగ్గింది. అలాగే.. దేశ వ్యాప్తంగా.. వ్యవసాయ పశువులు కూడా అంతరించపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పశువులు కలిగిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. పశు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద రైతులకు పశువులు కొనుగోలు చేయడానికి లోన్ సౌకర్యం కల్పిస్తుంది. ఈ పథకంలో రూ.1.8 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అలాగే దీనికి ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. గేదేలు, ఆవులను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ స్కీమ్ కేవలం హార్యానా రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.
పశు కిసాన్ పథకానికి కావాల్సిన సర్టిఫికేట్స్.. అప్లై విధానం..
1. ఆధార్ కార్డు.
2. పాన్ కార్డు..
3. ధరఖాస్తు ఫారమ్ నింపిన తర్వాత కేవైసీ పూర్తి చేయాలి.
4. పాస్ పోర్ట్ పరిమాణం ఇవ్వాలి.
5. పశు వైద్యులు తమ సమీప వెళ్లి.. దరఖాస్తు చేసుకోవచ్చు.
6. దరఖాస్తు ఫారమ్ ధృవీకరణ తర్వాత ఒక నెలలోనే పశువుల క్రెడిట్ కార్డ్ లభిస్తుంది.
అర్హులు..
1. పశువులకు ఆరోగ్య దృవీకరణ పత్రం ఉండాలి.
2. భీమా చేసిన జంతువులకు లోన్స్ లభిస్తాయి.
3. లోన్ తీసుకోవడానికి సివిల్ మంచిది.
4. హర్యానా నివాసి అయి ఉండాలి.
లోన్..
1. 1.60 లక్షల రూపాయల రుణంపై ఎటువంటి హామీ అవసరం లేదు.
2. ఒక గేదెకు 60,249 రూపాయలు లభిస్తాయి.
3. ఆవుకు 40,783 రూపాయలు లభిస్తాయి.
4. గొర్రెలు, మేకలకు రూ .4063 లభిస్తుంది.
5. కోడి (గుడ్డు పెట్టడానికి) రూ. 720 రుణం ఇవ్వబడుతుంది.
Share your comments