తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 10 సంవత్సరాలు దాటినా కొత్త రేషన్ కార్డులకోసం తెలంగాణ రాష్ట్రము లో కుటుంబాలకు నిరీక్షణ తప్పడంలేదు, చాల సంవత్సరాల నుంచి రేషన్ కాదు కొత్త అప్లికేషన్ కోసం ఎదురు చేస్తున్న వారికీ దసరా పండుగ సందర్భంగా శుభవార్త అందించాలని చూస్తుంది ప్రభుత్వం, మరి కొద్దీ రోజులలో కొత్త రేషన్ కార్డుల దరకాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది.
ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై సీఎం నేతృత్వంలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు.
కేవలం వీరికే రైతుభరోసా ;తెలంగాణ వ్యవసాయ మంత్రి కీలక ప్రకటన
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, అర్బన్ రూ.2 లక్షలలోపు ఆదాయన్ని పరిగణలోకి తీసుకొని గతంలో కార్డుల జారీ చేశారు.
అలాగే భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేయనున్నారు.
రాష్ట్రంలో దాదాపు 90 లక్షలమందికి రేషన్ కార్డు లబ్ధిదారులు వున్నారు, కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైతే ఒక కోటి దాటేఅవకాశం వుంది.
Share your comments