వయస్సు పైబడిన వారికీ ఆర్థిక చేయూత అందించే పెన్షన్ పథకం వృద్దులకు వరం అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ను అందిస్తున్నాయి ప్రభుత్వాలు .. వృద్ధుల బాధలను అర్ధం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఇంట్లో ఇద్దరికి పెన్షన్ను అందించే విధంగా పథకానికి రూపకల్పనలు చేస్తుంది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల ముందు ఈ హామీని ప్రకటించే అవకాశం ఉందని అంచనా.
ఎన్నికల లోపు ఈ ప్రక్రియను పూర్తిచేసి రాష్ట్ర వ్యాప్తంగా వృద్దులకు లకు మరింత భరోసాను కల్పించే దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తం గా ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది ఇప్పటికే సర్వే కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు.
ఇకనుండి ఈ పథకాలు పొందాలంటే టెన్త్ తప్పనిసరి..ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో ప్రస్తుతం 64 లక్షల మంది నిరుపేదలకు ప్రతి నెలా రూ.2750 పింఛన్‌ను ప్రభుత్వం అందిస్తుంది. వచ్చే జనవరి నుండి ఆ పింఛన్ రూ.3 వేలకు పెరగనుంది. గతంలో సీఎం జగన్ రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను విడతలవారీగా రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా రూ.2750 పింఛన్‌ను ప్రభుత్వం అందిస్తుంది.ప్రస్తుతం గత నాలుగు సంవత్సరాలుగా దశలవారీగా ప్రతి ఏడాది రూ.250 పెంచుతూ వస్తున్నారు. వచ్చే జనవరి నాటికి ఆ పింఛన్ రూ.3 వేలకు పెరగనుంది. ఈ నేపథ్యంలోనే పింఛన్‌ను పెంచి ఇవ్వడంతోపాటు అర్హులైన వారిని గుర్తించి ప్రతి ఇంటికీ రెండో పింఛన్‌ను కూడా ఇవ్వాలని సీఎం జగన్ యోచనకు వచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాది ఆరంభంలోనే పింఛన్ పెరుగదలతోపాటు రెండో పింఛన్ ప్రక్రియ కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Share your comments