వ్యవసాయ రంగం లో ఉత్త్పదకత ను పెంచడానికి వివిధ వ్యవసాయ పనిముట్ల పై ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన (PMKSY) పథకం ద్వారా రాయితీని కల్పిస్తున్నట్లు కేంద్ర వయ్వసాయ మరియు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు . జాతీయ వయవసాయ మరియు సంక్షేమ శాఖ వారు తక్కువ నీరు ఎక్కువ పంట అనే నినాదం తో ఈ పథకాన్ని ప్రారంభించారు . 2015-2016 నుంచి ఏది అన్ని రాష్ట్రాలలో అమలులో ఉందని అయన తెలిపారు .
ముఖ్యముగా ఈ పథకాల్లో భాగం గ తక్కువ నీటి వినియోగం తో ఎక్కువ పంటలు పండించే విధంగ బిందు సేద్యం మరియు స్పిన్క్లర్ల ల వినియోగించి ఎక్కువ పంటలను పండించడానికి 55 శాతం రాయితీ తో అందించడం జరుగుతుంది . ఈ పథకం క్రింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT ) ద్వారా అందించడం జరుగుతుంది .
ఈ పథకం లో 55 శాతం సబ్సిడీ మిగిలిన 45 శాతము లబ్ధిదారులు జత చేయవలసి ఉంటుంది . అయితే కొన్ని రాష్ట్రాలు వీటికి అదనముగా సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. ఇప్పటికే 1, 85,235 మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాయితీలు లబ్ది పొందినాటు కేంద్ర వ్యవసా శాఖ మంత్రి తెలిపారు .
ఏ విధంగ దీనికి దరఖాస్తు చేసుకోవాలి ?
ఈ పథకం కింద ధరఖాస్తుచేసుకోవడనికి ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ కేంద్రాలకు వెళ్లి సమాచారం తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
కావాల్సిన ధ్రువపత్రాలు : భూమికి సంబందించిన పాస్ బుక్ , బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు , కుల ధ్రువీకరణ పత్రం , మొబైల్ నెంబర్ OTP కొరకు
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకం(PMSKY) వెబ్సైటు లో దరఖాస్తు చేసుకోవాలి .
సూక్ష్మ సేద్యం యొక్క ప్రాముఖ్యత : నీటి ఎద్దడి కలిగిన ప్రదేశాలలో రైతులు తక్కువ నీటి తో అధిక పాటలను సాగు చెసుకోవచ్చు, బిందుసేద్యం ద్వారా రోజుకు ఒక మొక్క కు 2 లీటర్ల నుంచి 20 లీటర్ల వరకు నీటిని అదిచవచ్చు , త ద్వారా తక్కువ నీటి ఠీ అధిక సాగుకు వీలు కలుగు తుంది .
Share your comments